వైవిధ్య కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న నటుడు శశికుమార్. ఇటీవలే టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. వరుస సినిమాలు చేస్తున్న శశికుమార్ విజయాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది టూరిస్ట్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ చిత్రాలతో అభిమానులను అలరించాడు. అంతకుముందు 'అయోద్ధి'మూవీ, సూరి కథానాయకుడిగా నటించిన 'గరుడన్' చిత్రంలో ముఖ్యపాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు.
అంతేకాకుండా తమిళంలో నడుసెంటర్ (Nadu Center OTT Release) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో శశికుమార్ బాస్కెట్ బాల్ కోచ్ పాత్రలో కనిపించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా సందడి చేయనుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీతో సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు నరు నారయణన్ దర్శకత్వం వహించారు.


