వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని' | Nandamuri Tejaswini First time Brand Ambassador for jewellery company | Sakshi
Sakshi News home page

వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని'

Oct 31 2025 12:03 PM | Updated on Oct 31 2025 2:13 PM

Nandamuri Tejaswini First time Brand Ambassador for jewellery company

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు, విశాఖపట్నం ఎంపీ భరత్‌ సతీమణి తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఓ జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్అంబాసిడర్గా మొదటిసారి ఆమె పనిచేశారు. క్రమంలో ఒక వీడియోను విడుదల చేశారు. కెమెరా ముందు ఆమె తొలిసారే కనిపించినప్పటికీ చాలా చక్కగా యాడ్లో ఒదిగిపోయారు. నిమిషం పైగానే నిడివి ఉన్న ప్రకటనలో అనుభవం ఉన్న నటిగా మెప్పించడం విశేషం.

మొదటి నుంచి సినిమాలపై తేజస్విని ఆసక్తి చూపించేవారట! అందుకే ఆమె అఖండ 2 నిర్మాతగా పనిచేస్తున్నారు. ఆ పై తన తమ్ముడి మోక్షజ్ఞ చిత్రం కూడా ఆమె నిర్మాతగా లాంచ్చేయనున్నారు. అయితే, ఇప్పుడు వాణిజ్య ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. జ్యువెలర్స్‌ యాడ్‌కు దర్శకుడు వై.యమున కిషోర్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. బృంద మాస్టర్ కొరియోగ్ర‌ఫీకి తేజస్విని స్టెప్పులు అదుర్స్అనేలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement