breaking news
	
		
	
  tejaswani
- 
      
                   
                                                       వ్యాపార ప్రకటనలో తొలిసారి నటించిన 'నందమూరి తేజస్విని'సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు, విశాఖపట్నం ఎంపీ భరత్ సతీమణి తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఓ జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మొదటిసారి ఆమె పనిచేశారు. ఈ క్రమంలో ఒక వీడియోను విడుదల చేశారు. కెమెరా ముందు ఆమె తొలిసారే కనిపించినప్పటికీ చాలా చక్కగా యాడ్‌లో ఒదిగిపోయారు. నిమిషం పైగానే నిడివి ఉన్న ఈ ప్రకటనలో అనుభవం ఉన్న నటిగా మెప్పించడం విశేషం.మొదటి నుంచి సినిమాలపై తేజస్విని ఆసక్తి చూపించేవారట! అందుకే ఆమె అఖండ 2 నిర్మాతగా పనిచేస్తున్నారు. ఆ పై తన తమ్ముడి మోక్షజ్ఞ చిత్రం కూడా ఆమె నిర్మాతగా లాంచ్ చేయనున్నారు. అయితే, ఇప్పుడు ఈ వాణిజ్య ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జ్యువెలర్స్ యాడ్‌కు దర్శకుడు వై.యమున కిషోర్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీకి తేజస్విని స్టెప్పులు అదుర్స్ అనేలా ఉన్నాయి.
- 
      
                   
                                 శిరీష మృతి కేసులో తేజస్వినీ వాంగ్మూలం
 హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో తేజస్విని తాజాగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. శిరీష ఆత్మహత్య తనకు చాలా బాధ కలిగించిందని ఆమె తెలిపారు. ఇంత చిన్న విషయానికి ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను అనుకోలేదని చెప్పారు. రాజీవ్‌ను తాను పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం వాస్తవమేనని, అతని కోసమే తన ఉద్యోగాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నానని చెప్పారు.
 
 రాజీవ్‌తో శిరీష చనువుగా ఉండటంతో అతనితో తాను చాలాసార్లు గొడవపడ్డానని తెలిపారు. ఈ విషయమై శిరీష, తాను పోలీసు స్టేషన్లో చాలాసార్లు ఫిర్యాదు కూడా చేసుకున్నామని చెప్పారు. శిరీష వల్లే రాజీవ్ తనను దూరం పెడుతున్నాడన్న అనుమానం కలిగిందని తెలిపారు. రాజీవ్‌కు తెలియకుండా శిరీషతో ఫోన్లో చాలాసార్లు గొడవపడ్డానని వెల్లడించారు. రాజీవ్‌ను పెళ్లి చేసుకుంటానని అతని తల్లిదండ్రులను అడిగానని చెప్పారు.
 
 శిరీష, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతి కేసులను విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే నిందితులు రాజీవ్, శ్రవణ్ వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో శిరీష-తేజస్విని మధ్య గొడవలు కీలకంగా మారడంతో అసలు వీరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి తాజాగా తేజస్విని వాంగ్మూలాన్ని కూడా పోలీసులు సేకరించారు.


