ఓటీటీలోకి ఫాంటసీ రొమాంటిక్ కామెడీ సినిమా | Tamil fantasy romance ‘Kiss’ to stream on ZEE5 from Nov 7 starring Kavin and Preethi Asrani | Sakshi
Sakshi News home page

OTT: ముద్దు చూసి భవిష్యత్ చెప్పేస్తాడు.. ఓటీటీలోకి క్రేజీ మూవీ

Oct 31 2025 12:16 PM | Updated on Oct 31 2025 12:51 PM

Kavin Kiss Movie OTT Streaming Details

తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువ. తమిళ, మలయాళంలో మాత్రం చాలావరకు డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో మూవీస్ తీస్తుంటారు. దీంతో వీటిని మన ఆడియెన్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ ఫాంటసీ రొమాంటిక్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముద్దు బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుందనే చూద్దాం.

'పాపా', 'బ్లడీ బెగ్గర్' లాంటి డబ్బింగ్ మూవీస్‌తో తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో కవిన్. ఇతడి లేటెస్ట్ సినిమా 'కిస్'. ప్రీతి ఆస్రానీ హీరోయిన్. సెప్టెంబరు 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తమిళంలో మాత్రం దీన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్‪‌పై క్లారిటీ ఇచ్చేశారు. నవంబర్ 7 నుంచి జీ5లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)

'కిస్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో.. నెల్సన్(కవిన్) తల్లి దగ్గర పెరుగుతాడు. ప్రేమ, రొమాన్స్ లాంటివి ఇతడికి అస్సలు తెలీదు. ఓ రోజు అనుకోకుండా నెల్సన్ చేతికి ఓ పుస్తకం వస్తుంది. దీని ద్వారా అద్భుతమైన పవర్ వస్తుంది. ఎవరైనా ఇతడి ముందు ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తే వాళ్ల భవిష్యత్ ఏంటనేది ఇతడికి తెలిసిపోతుంది. అదే టైంలో తనకు బుక్ ఇచ్చిన సారా(ప్రీతి ఆస్రానీ) భవిష్యత్ ఏంటో నెల్సన్‌కి తెలుస్తుంది. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ప్రస్తుతానికి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నప్పటికీ.. త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది. రొమాంటిక్ జానర్ మూవీస్ అంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి ఇడ్లీ కొట్టు, లోక ఛాప్టర్ 1, కాంతార ఛాప్టర్ 1 సినిమాలు వచ్చాయి. వీటితో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇవి కాకుండా తలవర అనే మలయాళ మూవీ కూడా బాగుంది. 

(ఇదీ చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్‌మెంట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement