breaking news
Kiss Movie 2025
-
ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర'తో పాటు 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో', 'ప్రేమిస్తున్నా' అనే తెలుగు సినిమాలతో పాటు 'ఆర్యన్', 'ఫీనిక్స్' అనే డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో రష్మిక మూవీ తప్పితే మిగతా వాటిపై హైప్ లేదు. ఓటీటీల్లోనూ ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో కొన్నిమాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల్లో 'బ్యాడ్ గర్ల్', 'బారాముల్లా', 'కిస్', 'ద ఫెంటాస్టిక్ ఫోర్', 'అర్జున్ చక్రవర్తి'.. ఉన్నంతలో కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీటితో పాటు కొన్ని ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా వీకెండ్లో సడన్ సర్ప్రైజ్ అన్నట్లు కొత్త చిత్రాలు ఏమైనా రావొచ్చు కూడా. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ రానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 03 నుంచి 09 వరకు)హాట్స్టార్బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 05ద ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 05నెట్ఫ్లిక్స్డాక్టర్ సూస్ ద స్నీచెస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03ఇన్ వేవ్స్ అండ్ వార్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 03బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 07ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 07అమెజాన్ ప్రైమ్నైన్ టూ నాట్ మీట్ టూ యూ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) - నవంబరు 07ఆహాచిరంజీవ (తెలుగు చిత్రం) - నవంబరు 07జీ5కిస్ (తమిళ సినిమా) - నవంబరు 07తోడే దూర్ తోడే పాస్ (హిందీ సిరీస్) - నవంబరు 07సోనీ లివ్మహారాణి సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 07ఆపిల్ ప్లస్ టీవీప్లరిబస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 07మనోరమ మ్యాక్స్కరమ్ (మలయాళ సినిమా) - నవంబరు 07ఎమ్ఎక్స్ ప్లేయర్ఫస్ట్ కాపీ సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబరు 05లయన్స్ గేట్ ప్లేఅర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) - నవంబరు 07ద హ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 07(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో పిక్నిక్ పూర్తి.. దువ్వాడ కోసమే బయటకు! ఏమన్న ప్లానా?) -
ఓటీటీలోకి ఫాంటసీ రొమాంటిక్ కామెడీ సినిమా
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువ. తమిళ, మలయాళంలో మాత్రం చాలావరకు డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో మూవీస్ తీస్తుంటారు. దీంతో వీటిని మన ఆడియెన్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ ఫాంటసీ రొమాంటిక్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముద్దు బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుందనే చూద్దాం.'పాపా', 'బ్లడీ బెగ్గర్' లాంటి డబ్బింగ్ మూవీస్‌తో తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో కవిన్. ఇతడి లేటెస్ట్ సినిమా 'కిస్'. ప్రీతి ఆస్రానీ హీరోయిన్. సెప్టెంబరు 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తమిళంలో మాత్రం దీన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్పై క్లారిటీ ఇచ్చేశారు. నవంబర్ 7 నుంచి జీ5లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నటిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చిన్న కూతురు)'కిస్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో.. నెల్సన్(కవిన్) తల్లి దగ్గర పెరుగుతాడు. ప్రేమ, రొమాన్స్ లాంటివి ఇతడికి అస్సలు తెలీదు. ఓ రోజు అనుకోకుండా నెల్సన్ చేతికి ఓ పుస్తకం వస్తుంది. దీని ద్వారా అద్భుతమైన పవర్ వస్తుంది. ఎవరైనా ఇతడి ముందు ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తే వాళ్ల భవిష్యత్ ఏంటనేది ఇతడికి తెలిసిపోతుంది. అదే టైంలో తనకు బుక్ ఇచ్చిన సారా(ప్రీతి ఆస్రానీ) భవిష్యత్ ఏంటో నెల్సన్‌కి తెలుస్తుంది. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ప్రస్తుతానికి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నప్పటికీ.. త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది. రొమాంటిక్ జానర్ మూవీస్ అంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి ఇడ్లీ కొట్టు, లోక ఛాప్టర్ 1, కాంతార ఛాప్టర్ 1 సినిమాలు వచ్చాయి. వీటితో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇవి కాకుండా తలవర అనే మలయాళ మూవీ కూడా బాగుంది. (ఇదీ చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్)


