రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ అప్‌డేట్ | Ram Pothineni's Andhra King Taluka Release Date | Sakshi
Sakshi News home page

రామ్ కొత్త సినిమా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Aug 21 2025 4:33 PM | Updated on Aug 21 2025 4:53 PM

Ram Pothineni's Andhra King Taluka Release Date

స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్న హీరో రామ్.. మాస్ పక్కనబెట్టేశాడు. క్లాస్ సినిమా చేశాడు. అదే 'ఆంధ్ర కింగ్ తాలుకా'. ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్. ఇదివరకే ఓ మెలోడీ పాట రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రిలీజ్ తేదీని ప్రకటించారు.

ఈ ఏడాది ఇప్పటికే చాలావరకు సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నాయి. వచ్చే రెండు నెలల్లో రవితేజ 'మాస్ జాతర', తేజ సజ్జా 'మిరాయ్', అనుష్క 'ఘాటీ',  పవన్ కల్యాణ్ 'ఓజీ', రిషభ్ శెట్టి 'కాంతార' తదితర చిత్రాలు రాబోతున్నాయి. డిసెంబరులో 'రాజాసాబ్' లైనులో ఉంది. దీంతో కొత్త సినిమాలొచ్చినా సరే అన్ సీజన్‌లోనే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు రామ్ చిత్రం కూడా నవంబర్ 28న షెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు: డిస్కో శాంతి

అయితే 'ఆంధ్ర కింగ్ తాలుకా' సినిమాకు చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇదొచ్చిన వారానికి 'రాజాసాబ్' రిలీజ్ కానుంది. ఒకవేళ ఇది సంక్రాంతికి వాయిదా పడినా, అదే తేదీకి 'అఖండ 2' రావొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రెండింటిలో ఏది రిలీజైనా సరే రామ్ చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఇబ్బంది ఉండొచ్చు.

'ఆంధ్ర కింగ్ తాలుకా' చిత్రం హీరోలని అభిమానించే ఫ్యాన్ బయోపిక్ అని చెప్పారు. ఇందులో భాగ్య శ్రీ హీరోయిన్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడే రామ్-భాగ్యశ్రీ ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement