
'బంగారుకోడిపెట్ట వచ్చెనండి..' వంటి పలు స్పెషల్ సాంగ్స్‌లో డ్యాన్స్‌తో అలరించింది డిస్కో శాంతి (Disco Shanti). మొదట్లో సహాయనటిగా యాక్ట్ చేసినా ఐటం సాంగ్స్‌తోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. 1996లో టాలీవుడ్ హీరో శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి ఫ్యామిలీకే సమయం కేటాయించింది.
బుల్లెట్ మూవీలో..
2013లో శ్రీహరి అనారోగ్యంతో కన్నుమూయగా.. ఆ తర్వాత డిస్కో శాంతి ఎన్నో ఇబ్బందులు పడింది. రెండున్నర దశాబ్దాల తర్వాత ఆమె తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇస్తోంది. రాఘవ లారెన్స్ సోదరుడు ఎల్విన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న బుల్లెట్ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
మద్యానికి బానిస
అందులో డిస్కో శాంతి మాట్లాడుతూ.. బావ(శ్రీహరి) చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మిగిలాను. సరిగా తినకపోయేదాన్ని. తాగుడుకు బానిసయ్యాను. నువ్వు కూడా వదిలేసి వెళ్లిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని పిల్లలు అడిగారు. ఆ మాట నన్ను కదిలించింది, అప్పటినుంచి తాగుడు మానేశాను. ఐదేళ్లుగా దాని జోలికి పోలేదు. నా కొడుకు ఓ సినిమా చేశాడు. యాక్టింగ్ బాగా చేశాడు. కానీ మూవీ అస్సలు బాగోలేదు.
డైరెక్టర్ పారిపోయాడు
ఆ సినిమా చూసినప్పుడు డైరెక్టర్ ఎక్కడ? అని అడిగాను. అప్పటికే అతడు పారిపోయాడు, నా ముందుకు రాలేదు. అదొక సినిమానా? థూ.. నాకు వారం ముందు చెప్పినా ఏవైనా మార్పులుచేర్పులు చేసేదాన్ని. బావ సినిమాలకు కూడా చాలా కరెక్షన్స్ చేశాను అంటూ కుమారుడి సినిమాపై డిస్కో శాంతి అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీహరి- శాంతి పెద్ద కుమారుడు మేఘాంశ్ రాజ్‌ధూత్ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. 2019లో రిలీజైన ఈ సినిమా పరాజయం పాలైంది.
చదవండి: తెలుగు సీరియల్ నటి కూతురి పెళ్లి.. సెలబ్రిటీల హంగామా