
బుల్లితెర నటి, కార్తీకదీపం సీరియల్ విలన్ భావనా రెడ్డి ఇంట శుభకార్యం జరిగింది. భావన కూతురు రేష్మ పెళ్లిపీటలెక్కింది. తేజ అనే యువకుడితో రేష్మ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు విష్ణు-సిద్ధు, జ్యోతిరెడ్డి, ప్రియతమ్ చరణ్, ప్రీతమ్, ప్రభాకర్.. ఇలా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

సైలెంట్‌గా పెళ్లి చేసిన నటి
సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకునే భావన.. కూతురి పెళ్లిని మాత్రం గోప్యంగా ఉంచింది. కూతురి వెడ్డింగ్‌కు సంబంధించి ఒక్క ఫోటో, వీడియో కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయలేదు. సైలెంట్‌గా పెళ్లి చేయాలనుకుందో లేక సడన్ సర్‌ప్రైజ్ ఇద్దామనుకుందో తనకే తెలియాలి. భావనా రెడ్డి.. బుల్లితెరపై ముద్ద మందారం, త్రినయని, మావారు మాస్టారు.. ఇలా పలు సీరియల్స్‌లో నటించింది. కార్తీకదీపం ఫస్ట్ పార్ట్‌లో రుద్రాణిగా విలనిజం పండించింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కనిపించింది.
చదవండి: Bigg Boss Agnipariksha: ప్రోమో సూపర్.. కానీ టైమింగే తేడా!