ఏపీలో 'రవితేజ, నవీన్‌' సినిమాలకు టికెట్‌ ధరలు పెంపు | Bhartha Mahasayulaku Wignyapthi And Anaganaga oka raju tickets price hike in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 'రవితేజ, నవీన్‌' సినిమాలకు టికెట్‌ ధరలు పెంపు

Jan 10 2026 9:19 PM | Updated on Jan 11 2026 10:44 AM

Bhartha Mahasayulaku Wignyapthi And Anaganaga oka raju tickets price hike in AP

సంక్రాంతి సినిమాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ ధరలను పెంచుతూ జీఓ జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ది రాజాసాబ్‌. మన శంకరవర ప్రసాద్‌ గారు చిత్రాలకు ప్రీమియర్‌ షోలతో పాటు అదనపు ధరలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.. అయతే, తాజాగా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్‌ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' రెండు చిత్రాలకు కూడా టికెట్‌ ధరలు పెంచుతూ ఏపీ అనుమతి ఇచ్చింది.

'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ జనవరి 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా సింగిల్‌ స్క్రీన్స్‌లలో రూ. 50, మల్టీఫ్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు ఛాన్స్‌ దక్కింది. జీఎస్టీతో కలిపి ఈ ధరలు ఉంటాయి. అయితే, జనవరి 14న విడుదల కానున్న అనగనగా ఒక రాజు సినిమాకు కూడా ఇవే ధరలు వర్తిస్తాయి.  అదనంగా పెంచిన ధరలు 10రోజుల పాటు అమలులో ఉంటాయి. అయితే, తెలంగాణలో ఈ రెండు సినిమాలకు టికెట్‌ ధరలను పెంచలేదు. సాధారణ ధరలతోనే ప్రేక్షకులు సినిమా చూడొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement