
యంగ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలుకా'. ఈ మూవీని త్వరలో థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే తొలి గీతం రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ ప్రేమ పాటని ఆలపించాడు. తాజాగా దీని లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.
'నువ్వుంటే చాలే' అంటూ సాగే ఈ గీతం వినసొంపుగా ఉంది. అనిరుధ్ వాయిస్‌తో పాటు విజువల్స్ కూడా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తున్నాయి. ఈ సాంగ్‌కి వివేక్-మెర్విన్ ద్వయం సంగీతమందించారు. ఇకపోతే ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మహేశ్ బాబు.పి దర్శకుడు. ఓ వీరాభిమాని బయోపిక్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.