సెట్స్‌లో సూపర్‌స్టార్‌ | Upendra begins shooting for Andhra King Taluka | Sakshi
Sakshi News home page

సెట్స్‌లో సూపర్‌స్టార్‌

May 25 2025 1:14 AM | Updated on May 25 2025 1:14 AM

Upendra begins shooting for Andhra King Taluka

సూపర్‌ స్టార్‌ సూర్యకుమార్‌ సెట్స్‌కు వచ్చారు. రామ్‌ హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ, వీటీవీ గణేశ్‌ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సినీ సూపర్‌స్టార్‌ సూర్యకుమార్‌పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు.

ఈ సూర్యకుమార్‌ అభిమానిగా హీరోగా రామ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు ఉపేంద్ర. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. హీరో, ఆ హీరో అభిమానికి మధ్య జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ సినిమాకు సంగీతం: వివేక్‌–మెర్విన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement