మాస్ హీరో రామ్ పోతినేని(ram pothineni), భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్నూలులో ఈనెల 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ మూవీ రిలీజ్ తేదీని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలపై చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. ఒక రోజు ముందుగానే ఆంధ్రకింగ్ వచ్చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 27నే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు. దీంతో రామ్ పోతినేని ఫ్యాన్స్‌కు అడ్వాన్స్‌గా పండుగ రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌కు రామ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక రోజు ముందుగానే కంటెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుడగా.. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.
THANKS @filmymahesh for GIVING the content one day in advance! #AndhraKingTaluka is coming to you on #Thanksgiving #AKTonNOV27 #AndhraKingTaluka pic.twitter.com/55WgsZTvhN
— RAm POthineni (@ramsayz) November 16, 2025


