
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతరపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 28న విడుదల కానుంది.
వివేక్–మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘పప్పీ షేమ్...’ అంటూ సాగే వినోదాత్మకపాటని ఈ నెల 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. భారీగా జనం ఉన్న థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించారు రామ్. ఈ చిత్రానికి సీఈఓ: చెర్రీ, కెమెరా: సిద్ధార్థ నుని, సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలిమ్స్, ఎగ్జిక్యూటివ్ ్ర పొడ్యూసర్: హరి తుమ్మల.