సీజనల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా 'నువ్వుంటే చాలే' | Ram Pothineni Nuvvunte Chaley Song | Sakshi
Sakshi News home page

హీరో రామ్ రాసిన పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్

Jul 20 2025 7:39 PM | Updated on Jul 20 2025 7:39 PM

Ram Pothineni Nuvvunte Chaley Song

రామ్ నటించిన కొత్త సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. త్వరలో థియేటర్లలోకి రానుంది. రీసెంట్‌గానే ఈ మూవీ నుంచి 'నువ్వుంటే చాలే' అని సాగే పాటని రిలీజ్ చేశారు. హీరో రామ్ ఈ పాటని రాయగా రాక్ స్టార్ అనిరుధ్ పాడటం విశేషం. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. సీజనల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: 'భళ్లాలదేవ'గా నేనే చేయాలి.. కానీ: జయసుధ కొడుకు)

మహేష్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో ఓ పాటకు రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. ప్రేమకు నిజమైన అర్థాన్ని తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయాణంలా ఈ సాంగ్ అనిపిస్తుంది. రిలీజ్ చేసిన గంటల వ్యవధిలోని ఇది మ్యూజిక్ లవర్స్‌కి బాగా నచ్చేసింది. ఇదే పాటలో రామ్, భాగ్య శ్రీ జంట చూడముచ్చటగా ఉంది. కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ కానుందనిపిస్తోంది. 

(ఇదీ చదవండి: 'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement