
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే.. రామ్‌కు జంటగా నటిస్తోంది. ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 28న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని పప్పీ షేమ్ అనే పాటను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్‌ను రామ్‌నే ఆలపించడం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించహా.. వివేక్, మెర్విన్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు.