breaking news
Revolver Rita Movie
-
2025కి ముగింపు.. ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు
2025 చివరకొచ్చేసింది. మరోవారం పదిరోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. దీంతో ఈ వీకెండ్ బోలెడన్ని మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఛాంపియన్, దండోరా, శంబాల, ఈషా, పతంగ్ లాంటి తెలుగు సినిమాలతో పాటు వృషభ, బ్యాడ్ గర్ల్జ్, మార్క్, అనకొండ(హాలీవుడ్) తదితర డబ్బింగ్ మూవీస్ ఈ లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లో మంచి కంటెంట్ రాబోతుంది.(ఇదీ చదవండి: తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్లో ఈ కోణం ఉందా?)ఓటీటీల్లో ఈ వీకెండ్.. రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా', కీర్తి సురేశ్ 'రివ్వాల్వర్ రీటా', ఏక్ దివానే కీ దివానియత్, 'మిడిల్ క్లాస్' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. అలానే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2'.. ఈ వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 22 నుంచి 28 వరకు)నెట్ఫ్లిక్స్పోస్ట్హౌస్ (తగలాగ్ సినిమా) - డిసెంబరు 22గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 24ప్యారడైజ్ (మలయాళ చిత్రం) - డిసెంబరు 24ఆంధ్ర కింగ్ తాలుకా (తెలుగు సినిమా) - డిసెంబరు 25రివాల్వర్ రీటా (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 26స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 26హాట్స్టార్నోబడీ 2 (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 22ఒసిరిస్ (హిందీ డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 22అమడస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22ద బ్యాడ్ బాయ్ అండ్ మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22జీ5మిడిల్ క్లాస్ (తమిళ సినిమా) - డిసెంబరు 24రోంకిని భవన్ (బెంగాలీ సిరీస్) - డిసెంబరు 25ఏక్ దివానే కీ దివానియత్ (హిందీ మూవీ) - డిసెంబరు 26సన్ నెక్స్ట్నిధియం భూతవుం (మలయాళ సినిమా) - డిసెంబరు 24అమెజాన్ ప్రైమ్సూపర్ నేచురల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22టుగెదర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 22మిస్ సోఫీ సీజన్ 1 (జర్మన్ సిరీస్) - డిసెంబరు 22ఐ విస్ యూ ఆల్ ది బెస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 22యానివర్సరీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22(ఇదీ చదవండి: Bigg Boss 9 Telugu: బిగ్ రివ్యూ - ఆరంభం అదుర్స్, మరి ముగింపు?) -
ఓటీటీకి గురిపెట్టిన రివాల్వర్ రీటా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ 'రివాల్వర్ రీటా'. ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించారు. లేజీ ఓరియంటెండ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరమ్, రూట్స్ ప్రొడక్షన్స్ జగదీశ్ పళనిస్వామి కలిసి నిర్మించారు. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు.రివాల్వర్ రీటా కథేంటంటే..పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్) నాన్న చిన్నప్పుడే ల్యాండ్ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్ చేస్తారు.మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్ నర్సిరెడ్డి(అజయ్ గోష్) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ.Watch Revolver Rita on Netflix out 26 December in Tamil, Telugu, Kannada and Malayalam#RevolverRitaOnNetflix@KeerthyOfficial @Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute @RSeanRoldan @dineshkrishnanb @Cinemainmygenes @dhilipaction @mkt_tribe…— Netflix India South (@Netflix_INSouth) December 21, 2025 -
'రివాల్వర్ రీటా' మూవీ రివ్యూ
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. నేడు(నవంబర్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్) నాన్న చిన్నప్పుడే ల్యాండ్ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్ చేస్తారు. మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్ నర్సిరెడ్డి(అజయ్ గోష్) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ(Revolver Rita Movie Story In Telugu). ఎలా ఉందంటే.. అనుకోకుండా హత్య చేయడం..ఆ శవాన్ని తరలించే ప్రయత్నం..ఈ క్రమంలో ఒక్కో ట్విస్ట్ బయటకు రావడం.. చివరకు ఈ హత్య వెనక కూడా ఓ రహస్యం ఉండడం..ఇలాంటి నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రివాల్వర్ రీటా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ఓ హత్య చుట్టూ తిరిగే డార్క్ కామెడీ థ్రిల్లర్. కర్మ ఎవరినీ విడిచి పెట్టదు.. దాని ఫలితాన్ని అనుభవించక తప్పదనే కోణంలో ఈ మూవీ కథనం సాగుతుంది. అయితే దర్శకుడు ఎంచుకున్న ఈ పాయింట్ వినడానికి కొత్తగా అనిపిస్తుంది కానీ...తెరపై మాత్రం అది మిస్ అయింది. సినిమా చూస్తున్నంత సేపు దృశ్య 2 మొదలు మొన్నటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాల వరకు చాలా చిత్రాలు గుర్తుకువస్తాయి. కామెడీ అనుకొని రాసిన సన్నివేశాలు కూడా పెద్దగా పేలలేదు. ఉన్నంతలో రాధికా శరత్ కుమార్, రెడిన్ కింగ్స్లీ కాస్త నవ్వులు పంచారు. ఇక ట్విస్టులు అనుకొని రాసిన సన్నివేశాలు కూడా డార్క్ కామెడీ చిత్రాలు రెగ్యులర్‌గా చూసేవాళ్లు ఈజీగా పసిగట్టగలరు. కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ప్రారంభంలోనే పాండిచ్చేరి డాన్ పాండ్య- నర్సిరెడ్డి మధ్య వైర్యానికి గల కారణం ఏంటో చెప్పి.. కథను కామెడీ జానర్లోని మార్చేశాడు. రీటా ఫ్యామిలీ పరిచయ సీన్లతో పాటు..పాండ్య హత్యవరకు అన్నీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. హత్య తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో వచ్చే చేజింగ్ సీన్లు.. బోరింగ్‌గా సాగుతాయి. ఒకటి రెండు చోట్ల రెడిన్ కింగ్స్లీ వేసే పంచ్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. అంతేకానీ సునీల్ సీన్లతో పాటు జాన్ విజయన్ సన్నివేశాలు కూడా రొటీన్‌గానే అనిపిస్తాయి. చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆకట్టుకుంటాయి. అయితే ముందుగా చెప్పినట్లు ఈ తరహా కథలు చాలానే రావడం.. క్రైమ్, కామెడీ సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేకపోవడంతో.. ‘రివాల్వర్ రీటా’ తూట సరిగా పేలలేకపోయిందనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు.ఎవరెలా చేశారంటే.. టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్..మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అయితే కథలోనే కొత్తదనం లేకపోవడంతో.. ఆమె నటనలోనూ కొత్త కోణం ఏది కనిపించదు. రీటా తల్లి చెల్లమ్మగా నటించిన రాధిక శరత్ కుమార్.. అమాయకత్వపు పనులతో నవ్వులు పూయించింది. సునీల్ పాత్ర లుక్ చాలా సీరియస్‌గా ఉన్నప్పటికీ.. అది తెరపై కనిపించలేదు. జాన్ విజయన్ కూడా రొటీన్ పోలీసు పాత్రలో కనిపించాడు. రెడిన్ కింగ్స్లీ ఎప్పటి మాదిరే తనదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. బాత్రూం సీన్ ఒక్కటి బాగా వర్కౌట్ అయింది. సూపర్ సుబ్బరాయన్, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సీన్ రోల్డాన్ నేపథ్య సంగీతం ఓకే. దినేష్ కృష్ణన్. బి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్. కె.ఎల్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వెరైటీ డ్రస్‌తో కీర్తి సురేశ్ వెరైటీ పోజులు (ఫొటోలు)
-
కీర్తి సురేశ్ సీరియస్ కామెడీ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
మహానటి కీర్తి సురేశ్(Keerthy Suresh) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఉమెన్ సెంట్రిక్ కథతో మరోసారి అభిమానులను అలరించనుంది. కీర్తి సురేశ్ లీడ్ రోల్లో వస్తోన్న చిత్రం రివాల్వర్ రీటా. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే కొత్త రిలీజ్ తేదీని రివీల్ చేశారు. నవంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగానే రివాల్వర్ రీటా ట్రైలను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై నిర్మించారు. మరి రివాల్వర్ రీటా ట్రైలర్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. Keerthy with her sense of humour should deftly choose more and more quirky stories like this. 😄Here’s the fun #RevolverRitaTrailer Telugu ▶️ https://t.co/XOgxBac61Q@KeerthyOfficial @Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute… pic.twitter.com/7feMsfAhL2— Nani (@NameisNani) November 13, 2025 -
రివాల్వర్ రీటాకు టైమ్ ఫిక్స్
పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉన్న నటి కీర్తీ సురేశ్(Keerthy Suresh). ఆ మధ్య మహానటి, దసర, సినీ కాగితం వంటి చిత్రాలలో తన నటనకు గానూ ప్రశంసలు అందుకున్న ఈ భామ ఇటీవల నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన రీతిలో విజయం సాధించలేదు. ముఖ్యంగా తమిళంలో మంచి అంచనాలతో తెరకెక్కిన రఘు తాతా చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అదే విధంగా హిందీలో నటించిన తొలి చిత్రం బేబీజాన్ కూడా అపజయాన్నే మిగిల్చింది. అలాంటి పరిస్థితుల్లో కీర్తీ సురేశ్ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తాటిల్‌ను పెళ్లి చేసుకుని నటనకు చిన్న గ్యాప్ ఇచ్చారు.ఆ తరువాత ఈమె నటించిన వెబ్ సిరీస్ ఉప్పు కప్పురంబు ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అలా గత ఏడాది నుంచి ఈ బ్యూటీకి హిట్ లేకుండాపోయింది. కాగా పెళ్లికి ముందు నటించిన చిత్రాల్లో రివాల్వర్ రీటా(Revolver Rita) ఒకటి. ది రూట్ సంస్థ, ది ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జేకే.చంద్రు దర్శకత్వం వహించారు. ఇది హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రం అన్నది గమనార్హం. కామెడీ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి శ్యాన్ లోల్డన్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని గత ఏడాది ఆగస్ట్‌లోనే విడుదల కావలసింది. కారణాలేమైనా విడుదల వాయిదా పడింది. కాగా తాజాగా రివాల్వర్ రీటాను ఈ నెల 28న విడుదల చేయడానికి ప్లాన్ రెడీ చేశారు. కాగా ఈ చిత్ర విజయం నటి కీర్తీసురేశ్‌కు చాలా అవసరం. మరి ఇది ఎలాంటి రిజల్డ్‌ను ఇస్తుందో చూడాలి. ప్రస్తుతానికి కోలీవుడ్‌లో కొత్తగా అవకాశాలు లేవు. కానీ, తెలుగులో వరుసగా అవకాశాలు వరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
చాన్నాళ్ల తర్వాత ఈ హీరోయిన్ల 'తెలుగు' సినిమాలు
ఎప్పటిక్పపుడు సినిమాలు చేస్తూ ఉంటేనే హీరోలకైనా హీరోయిన్లకైనా ఫేమ్ ఉంటుంది. అలానే హిట్ కూడా కొడుతూ ఉండాలి. లేదంటే ప్రేక్షకులు మర్చిపోయే అవకాశముంది. సరే ఇదంతా పక్కనబెడితే తెలుగులో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఓ ఇద్దరు.. చాలా గ్యాప్ తర్వాత తమ కొత్త చిత్రాల్ని మన దగ్గర రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్స్ అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్)స్వతహాగా మలయాళీ అయినప్పటికీ 'నేను శైలజ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్.. తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాలు చేసింది. హిట్స్, ఫ్లాప్స్ అందుకుంది. అయితే 2023లో వచ్చిన 'భోళా శంకర్' తర్వాత మరో మూవీలో కనిపించలేదు. గతేడాది 'కల్కి'లో ఈమె ఉంది కానీ కారు పాత్రకు డబ్బింగ్ చెప్పిందంతే. ఎన్నాళ్లగానో సెట్స్‌పై ఉండిపోయిన 'రివాల్వర్ రీటా' మూవీ.. ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబరు 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుందని పోస్టర్ అయితే వదిలారు. గతంలో పలుమార్లు ఇలానే చెప్పారు గానీ వాయిదాపడింది. ఈసారైనా చెప్పిన టైంకి వస్తుందా లేదంటే మళ్లీ వాయిదా అనేది చూడాలి?గతేడాది సంక్రాంతికి రిలీజైన 'నా సామి రంగ' చిత్రంతో ఆకట్టుకున్న ఆషికా రంగనాథ్.. తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లోనూ నటించింది. కానీ ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇంతలోనే 'గత వైభవం' అనే కన్నడ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయింది. నవంబరు 14న ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ కానుంది. దుశ్యంత్, ఆషిక హీరోహీరోయిన్లు కాగా సునీ దర్శకుడు. ఫాంటసీ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)


