చాన్నాళ్ల తర్వాత ఈ హీరోయిన్ల 'తెలుగు' సినిమాలు | Keerthy Suresh And Ashika Ranganath Latest Movies | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ హీరోయిన్స్ కొత్త మూవీస్.. ఈ నెలలోనే రిలీజ్

Nov 9 2025 9:13 PM | Updated on Nov 9 2025 9:13 PM

Keerthy Suresh And Ashika Ranganath Latest Movies

ఎప్పటిక్పపుడు సినిమాలు చేస్తూ ఉంటేనే హీరోలకైనా హీరోయిన్లకైనా ఫేమ్ ఉంటుంది. అలానే హిట్‌ కూడా కొడుతూ ఉండాలి. లేదంటే ప్రేక్షకులు మర్చిపోయే అవకాశముంది. సరే ఇదంతా పక్కనబెడితే తెలుగులో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఓ ఇద్దరు.. చాలా గ్యాప్ తర్వాత తమ కొత్త చిత్రాల్ని మన దగ్గర రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్స్ అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్)

స్వతహాగా మలయాళీ అయినప్పటికీ 'నేను శైలజ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్.. తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసింది. హిట్స్, ఫ్లాప్స్ అందుకుంది. అయితే 2023లో వచ్చిన 'భోళా శంకర్' తర్వాత మరో మూవీలో కనిపించలేదు. గతేడాది 'కల్కి'లో ఈమె ఉంది కానీ కారు పాత్రకు డబ్బింగ్ చెప్పిందంతే. ఎన్నాళ్లగానో సెట్స్‌పై ఉండిపోయిన 'రివాల్వర్ రీటా' మూవీ.. ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబరు 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుందని పోస్టర్ అయితే వదిలారు. గతంలో పలుమార్లు ఇలానే చెప్పారు గానీ వాయిదాపడింది. ఈసారైనా చెప్పిన టైంకి వస్తుందా లేదంటే మళ్లీ వాయిదా అనేది చూడాలి?

గతేడాది సంక్రాంతికి రిలీజైన 'నా సామి రంగ' చిత్రంతో ఆకట్టుకున్న ఆషికా రంగనాథ్.. తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లోనూ నటించింది. కానీ ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇంతలోనే 'గత వైభవం' అనే కన్నడ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయింది. నవంబరు 14న ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ కానుంది. దుశ్యంత్, ఆషిక హీరోహీరోయిన్లు కాగా సునీ దర్శకుడు. ఫాంటసీ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?

(ఇదీ చదవండి: స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement