breaking news
Gatha Vaibhavam Movie
-
ఆ ఇష్టంతోనే జానకి రాముడు సినిమా చేశాను: నాగార్జున
‘‘నాకు గత జన్మ సినిమాలంటే ఇష్టం. నాన్నగారి ‘మూగమనసులు’ సినిమాతో నాకు బాగా పరిచయం. నేనూ అదే ఇష్టంతో ‘జానకి రాముడు’ సినిమా చేశాను. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘గత వైభవం’ చిత్రం నాలుగు జనరేషన్ల కథ. ట్రైలర్ చూస్తే టీమ్ కష్టం తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావాలి’’ అని చె΄్పారు నాగార్జున. ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ నటించిన ఫ్యాంటసీ డ్రామా ‘గత వైభవం’. సింపుల్ సుని దర్శకత్వంలో దీపక్ తిమ్మప్ప, సుని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ‘‘గత వైభవ’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది’’ అన్నారు దుష్యంత్. ‘‘చాలా ఎమోషనల్‌గా, ప్రేమతో మేం చేసిన సినిమా ఇది’’ అని పేర్కొన్నారు ఆషిక. ‘‘కమర్షియల్ హంగులున్న ప్రయోగాత్మక చిత్రమిది’’ అని చె΄్పారు సింపుల్ సుని. ‘‘ఈ సినిమా టీజర్ చూడగానే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా వైబ్ వచ్చింది’’ అన్నారు చైతన్య రెడ్డి. -
'గత వైభవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆషిక 'గత వైభవం' ట్రైలర్ రిలీజ్
తెలుగులో 'అమిగోస్', 'నా సామి రంగ' సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆషికా రంగనాథ్.. చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఓ కథానాయికగా చేసింది. ఈమె నటించిన ఓ కన్నడ మూవీ ఇప్పుడు తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. అదే 'గత వైభవం'. మూడు వేర్వేరు కాలాల్లో జరిగే ఫాంటసీ కథతో దీన్ని తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)నవంబరు 14న ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ కానుంది. ట్రైలర్ చూస్తుంటే కాన్సెప్ట్ పరంగా బాగానే ఉంది గానీ విజువల్స్, కంటెంట్ మాత్రం ఓకే ఓకే అనిపించేలా ఉన్నాయి. ఇదే రోజున దుల్కర్ సల్మాన్ 'కాంత'తో పాటు సంతాన ప్రాప్తిరస్తుతో పాటు పలు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. మరి వీటితో పాటు పోటీలో నిలిచి 'గత వైభవం' ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: బింధుమాధవి వేశ్య పాత్రలో.. 'దండోరా' రిలీజ్ డేట్ ఫిక్స్) -
చాన్నాళ్ల తర్వాత ఈ హీరోయిన్ల 'తెలుగు' సినిమాలు
ఎప్పటిక్పపుడు సినిమాలు చేస్తూ ఉంటేనే హీరోలకైనా హీరోయిన్లకైనా ఫేమ్ ఉంటుంది. అలానే హిట్ కూడా కొడుతూ ఉండాలి. లేదంటే ప్రేక్షకులు మర్చిపోయే అవకాశముంది. సరే ఇదంతా పక్కనబెడితే తెలుగులో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఓ ఇద్దరు.. చాలా గ్యాప్ తర్వాత తమ కొత్త చిత్రాల్ని మన దగ్గర రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్స్ అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్)స్వతహాగా మలయాళీ అయినప్పటికీ 'నేను శైలజ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్.. తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాలు చేసింది. హిట్స్, ఫ్లాప్స్ అందుకుంది. అయితే 2023లో వచ్చిన 'భోళా శంకర్' తర్వాత మరో మూవీలో కనిపించలేదు. గతేడాది 'కల్కి'లో ఈమె ఉంది కానీ కారు పాత్రకు డబ్బింగ్ చెప్పిందంతే. ఎన్నాళ్లగానో సెట్స్‌పై ఉండిపోయిన 'రివాల్వర్ రీటా' మూవీ.. ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబరు 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుందని పోస్టర్ అయితే వదిలారు. గతంలో పలుమార్లు ఇలానే చెప్పారు గానీ వాయిదాపడింది. ఈసారైనా చెప్పిన టైంకి వస్తుందా లేదంటే మళ్లీ వాయిదా అనేది చూడాలి?గతేడాది సంక్రాంతికి రిలీజైన 'నా సామి రంగ' చిత్రంతో ఆకట్టుకున్న ఆషికా రంగనాథ్.. తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లోనూ నటించింది. కానీ ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇంతలోనే 'గత వైభవం' అనే కన్నడ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయింది. నవంబరు 14న ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ కానుంది. దుశ్యంత్, ఆషిక హీరోహీరోయిన్లు కాగా సునీ దర్శకుడు. ఫాంటసీ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)


