చైతన్య రెడ్డి, దుష్యంత్, నాగార్జున, ఆషికా రంగనాథ్
‘‘నాకు గత జన్మ సినిమాలంటే ఇష్టం. నాన్నగారి ‘మూగమనసులు’ సినిమాతో నాకు బాగా పరిచయం. నేనూ అదే ఇష్టంతో ‘జానకి రాముడు’ సినిమా చేశాను. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘గత వైభవం’ చిత్రం నాలుగు జనరేషన్ల కథ. ట్రైలర్ చూస్తే టీమ్ కష్టం తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావాలి’’ అని చె΄్పారు నాగార్జున. ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ నటించిన ఫ్యాంటసీ డ్రామా ‘గత వైభవం’. సింపుల్ సుని దర్శకత్వంలో దీపక్ తిమ్మప్ప, సుని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ‘‘గత వైభవ’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది’’ అన్నారు దుష్యంత్. ‘‘చాలా ఎమోషనల్‌గా, ప్రేమతో మేం చేసిన సినిమా ఇది’’ అని పేర్కొన్నారు ఆషిక. ‘‘కమర్షియల్ హంగులున్న ప్రయోగాత్మక చిత్రమిది’’ అని చె΄్పారు సింపుల్ సుని. ‘‘ఈ సినిమా టీజర్ చూడగానే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా వైబ్ వచ్చింది’’ అన్నారు చైతన్య రెడ్డి.


