తెలుగులో 'అమిగోస్', 'నా సామి రంగ' సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆషికా రంగనాథ్.. చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఓ కథానాయికగా చేసింది. ఈమె నటించిన ఓ కన్నడ మూవీ ఇప్పుడు తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. అదే 'గత వైభవం'. మూడు వేర్వేరు కాలాల్లో జరిగే ఫాంటసీ కథతో దీన్ని తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)
నవంబరు 14న ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ కానుంది. ట్రైలర్ చూస్తుంటే కాన్సెప్ట్ పరంగా బాగానే ఉంది గానీ విజువల్స్, కంటెంట్ మాత్రం ఓకే ఓకే అనిపించేలా ఉన్నాయి. ఇదే రోజున దుల్కర్ సల్మాన్ 'కాంత'తో పాటు సంతాన ప్రాప్తిరస్తుతో పాటు పలు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. మరి వీటితో పాటు పోటీలో నిలిచి 'గత వైభవం' ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: బింధుమాధవి వేశ్య పాత్రలో.. 'దండోరా' రిలీజ్ డేట్ ఫిక్స్)


