కలర్ ఫోటో, బెదురులంక 2012 సినిమాలని నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా 'దండోరా'. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న మూవీ థియేటర్లలోకి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)
అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని 'దండోరా' సినిమా తీశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ దీన్ని తెరకెక్కించారు. శివాజీతో పాటు నవదీప్, బిందు మాధవి తదితరులు నటించారు. బిందుమాధవి ఇందులో వేశ్య పాత్రలో కనిపించనుంది.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్‌లో ఎవరంటే?)


