మహానటి కీర్తి సురేశ్(Keerthy Suresh) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఉమెన్ సెంట్రిక్ కథతో మరోసారి అభిమానులను అలరించనుంది. కీర్తి సురేశ్ లీడ్ రోల్‌లో వస్తోన్న చిత్రం రివాల్వర్ రీటా. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే కొత్త రిలీజ్ తేదీని రివీల్ చేశారు. నవంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగానే రివాల్వర్ రీటా ట్రైలను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై నిర్మించారు. మరి రివాల్వర్ రీటా ట్రైలర్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.
Keerthy with her sense of humour should deftly choose more and more quirky stories like this. 😄
Here’s the fun #RevolverRitaTrailer
Telugu ▶️ https://t.co/XOgxBac61Q@KeerthyOfficial @Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute… pic.twitter.com/7feMsfAhL2— Nani (@NameisNani) November 13, 2025


