 
													ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చూసే ఆడియెన్స్ కూడా ఉంటారు. వాళ్లలో చాలామందికి నచ్చే సిరీస్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. తొలుత రిలీజ్ చేసినప్పుడు ఇంగ్లీష్‌లో మాత్రమే ఉండేది. కానీ తర్వాత కాలంలో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సిరీస్ చివరి సీజన్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. తేదీలని ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)
ఇప్పటికే నాలుగు సీజన్లు రాగా వేటికవే అదరగొట్టేశాయి. 2022లో చివరగా నాలుగో సీజన్ రిలీజైంది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా ఈ సిరీస్ ఫ్యాన్ బాగానే ఎదురుచూస్తున్నారు. వాళ్ల వెయిటింగ్‍కి తెరదించుతూ కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్ తేదీల్ని అధికారికంగా ప్రకటించారు. నవంబరు 26, డిసెంబరు 25, డిసెంబరు 31వ తేదీల్లో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో విల్, మైక్, డస్టిన్, లూకస్ అనే నలుగురు పిల్లలు ఉంటారు. అనుకోకుండా ఓ రోజు ఎలెవన్ అనే అమ్మాయి.. ఈ నలుగురి కంట పడుతుంది. కొన్నిరోజులకే వీళ్లంతా స్నేహితులు అయిపోతారు. అయితే తమతో ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి సూపర్ పవర్స్ ఉన్నాయనీ ఈ పిల్లలకు తెలుస్తుంది. వీళ్లంతా కలిసి తమ ఊరికి ఎదురైన ప్రమాదాల్ని ఎలా ఆపగలిగారు? ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అనేది మెయిన్ స్టోరీ.
(ఇదీ చదవండి: డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై షాకింగ్ రూమర్స్)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
