వెబ్‌ సిరీస్‌ ప్రపంచంలో మరో నటుడు.. అప్పుడే స్ట్రీమింగ్‌ | Vikranth's LBW Web Series Release Date, OTT Platform Details | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ నేపథ్యంలో LBW వెబ్‌ సిరీస్‌.. వచ్చేవారమే స్ట్రీమింగ్‌

Dec 24 2025 10:32 AM | Updated on Dec 24 2025 10:43 AM

Vikranth's LBW Web Series Release Date, OTT Platform Details

కథానాయకుడిగా, సపోర్టింగ్‌ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు నటుడు విక్రాంత్‌. ఈయన ఇప్పుడు వెబ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. విక్రాంత్‌ కథానాయకుడిగా నటించిన వెబ్‌ సీరీస్‌ ఎల్బీడబ్ల్యూ (లవ్‌ బియాండ్‌ వికెట్‌). హార్ట్‌బీట్‌ సీరీస్‌ నిర్మించిన అట్లి ఫ్యాక్టరీ ఎల్బీడబ్ల్యూ తెరకెక్కిస్తోంది. ఆసక్తికరమైన అంశాలతో క్రికెట్‌ నేపథ్యంలో సాగే వెబ్‌సీరీస్‌ ఇది. 

రంగన్‌ అనే క్రికెటర్‌ తన జట్టు విజయం సాధించడంలో విఫలం అవుతాడు. ఆ తరువాత అకాడమీ శిక్షకుడిగా బాధ్యతలను నిర్వహిస్తూ క్రికెట్‌లో జయించడానికి పోరాడే మరో జట్టు బాధ్యతలను తనపై వేసుకుంటాడు. అలా అతను ఆ జట్టును విజయపథంలోకి తీసుకెళ్తాడా? లేదా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠ భరితంగా సాగే ఇతివృత్తంతో రూపొందించిన ఈ వెబ్‌ సీరీస్‌ నూతన సంవత్సరం కానుకగా జనవరి ఒకటో తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement