Radhika Pandit
-
'కేజీఎఫ్' యష్.. రూ.24 కోట్ల డీల్
కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్.. ప్రస్తుతం 'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్నాడు. మరోవైపు హీరోగా నటించిన 'టాక్సిక్' రిలీజ్ కావాల్సి వచ్చింది. లెక్క ప్రకారం రెండోసారి వాయిదా పడిన తర్వాత జూన్ 4నే విడుదల అని అన్నారు గానీ ఇప్పటివరకు సౌండ్ లేదు అంటే కచ్చితంగా వాయిదా పడినట్లే. ఇవి అలా ఉండగానే యష్ దంపతులు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)యష్, అతడి భార్య రాధిక పండిట్ కలిసి.. మహారాష్ట్రలోని ప్రముఖ తీర ప్రాంత పర్యాటక కేంద్రం అలీబాగ్‌లో భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టారు. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ లియాసెస్ ఫోరాస్ ప్రకారం అలీబాగ్ తాలూకా కమత్ గ్రామంలో ఉన్న భూమిని రూ.24 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లావాదేవీ 18వ తేదీన అలీబాగ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు అయింది.5,289 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన రెండు అనుబంధ వ్యవసాయ భూములు ఇందులో ఉన్నాయి. ఆ స్థలంలో ఒక నివాస గృహ నిర్మాణం కూడా ఉన్నట్లు పత్రాలతో తెలిసింది. అయితే ఈ స్థలాన్ని ఇల్లు కట్టుకునేందుకు కొనుగోలు చేశారా? లేదంటే రియల్ ఎస్టేట్ కోసమా తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా అలీబాగ్ ప్రాంతం సినీ ప్రముఖులు దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబైకి సమీపంలో ఉండటంతో పాటు అందమైన కొంకణ్ తీర ప్రాంతం కారణంగా అలీబాగ్ హాట్ టాపిక్ అయిపోతోంది.(ఇదీ చదవండి: మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు.. సీఎం విజయ్ తో ఖుష్బూ) -
నా భర్తే నా సర్వస్వం.. ఎందుకో తెలుసా?: యష్ భార్య
కన్నడ స్టార్ హీరో యష్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లవుతోంది. 2016లో నటి రాధికా పండిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు ఐరా, కుమారుడు యాత్రవ్ సంతానం. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా రాధిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ అద్భుతమైన వీడియో షేర్ చేసింది. నా సర్వస్వం నా భర్తే అని ఎందుకంటానో తెలుసా? అంటూ మొదట్లో ఓ క్యాప్షన్ వచ్చింది. అతడే నా సర్వస్వంఆ వెంటనే దానికి సమాధానంగా.. నా భర్త నా పర్సనల్ బాడీగార్డ్, నా చాట్‌జీపీటీ, నా చెఫ్, నా పర్సనల్ ఫోటోగ్రాఫర్, నా మెంటార్, నా డీజే, నా డాక్టర్, నా కాలిక్యులేటర్, నా స్ట్రెస్ బస్టర్ అంటూ యష్ ఏఐ ఫోటోల్ని జత చేసింది. చివర్లో మాత్రం నా ప్రశాంతతకు కారకుడు అంటూ భర్తపై వాలిపోయి ఉన్న ఒరిజినల్ ఫోటోను యాడ్ చేసింది. ఇది చూసిన అభిమానులు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని యష్‌ను కొనియాడుతున్నారు.సినిమాకేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్ ప్రస్తుతం రామాయణ మూవీలో రావణుడిగా నటిస్తున్నాడు. అలాగే టాక్సిక్ సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
సతీమణి బర్త్ డే.. భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన కేజీఎఫ్ స్టార్
కేజీఎఫ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ఈ మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రావణుడి పాత్రలో యశ్ మెప్పించనున్నారు.అయితే నటి రాధిక పండిట్‌ను యశ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2016లో వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఇటీవల మార్చి 7న యశ్ భార్య రాధిక పండిట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో హీరో యశ్ సతీమణికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించాడు. 1981లో వచ్చిన కన్నడ మూవీలోని పాటను పాడి సతీమణికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాధిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే కేజీఎఫ్ స్టార్ యశ్ చివరిసారిగా కేజీఎఫ్-2లో కనిపించారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
సంపాదన గురించి అడగదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం..: యష్
కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఇతడు టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అలాగే భార్య రాధికతో తన అనుబంధం ఎలా ఉంటుందన్నది వెల్లడించాడు.నా అదృష్టంరాధిక నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం. తనే నా బలం. ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలబడుతుంది. నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటుంది. మొదట తనను స్నేహితురాలిగా చూశాను. తర్వాత భార్యగా స్వీకరించాను. నాకు ఏది నచ్చుతుంది? ఏంటనేది అన్నీ తనకు బాగా తెలుసు. అలాగే ఏదైనా సినిమా చేసినప్పుడు నా రెమ్యునరేషన్ ఎంత? ఫలానా మూవీ వల్ల ఎంత డబ్బు వస్తుంది? ఎంత సంపాదిస్తున్నావ్? వంటి ప్రశ్నలు వేయదు.ఒకే ఒక్కే ప్రశ్నకేవలం ఒకే ఒక్కే ప్రశ్న అడుగుతుంది.. నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని! తనతో, కుటుంబంతో గడిపేందుకు కొంత సమయం కేటాయించమని చెప్తూ ఉంటుంది. కానీ ఆ టైమే నాకు పెద్దగా దొరకదు. అయినా సరే నావంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా ప్యాషన్ (సినిమా) కోసం ఏం చేయడానికైనా వెనుకాడను. ఈ విషయంలో ఫ్యామిలీ కూడా నాకు అండగా ఉంటుంది. కాకపోతే ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉంటావు? ఇంటికి ఎప్పుడు తిరిగొస్తావు? అని అడుగుతూ ఉంటారంతే అని చెప్పుకొచ్చాడు.ప్రేమ కహానీకాగా యష్, రాధిక 'నందగోకుల' అనే సీరియల్లో కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం తర్వాత ఫ్రెండ్షిప్గా, అనంతరం ప్రేమగా మారింది. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, శాంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్, మొగ్గిన మనసు, డ్రామా వంటి చిత్రాల్లోనూ కలిసి యాక్ట్ చేశారు. 2016లో యష్-రాధిక పెళ్లి చేసుకోగా వీరికి ఆర్య, యాత్రవ్ అని పిల్లలు జన్మించారు.చదవండి: 'అతను ఒక పవర్‌హౌస్'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్! -
కేజీఎఫ్ హీరో యశ్ భార్య ఎమోషనల్ పోస్ట్.. లవ్ యూ అంటూ..!
కేజీఎఫ్ హీరో యశ్ టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. రాఖీభాయ్‌గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. శాండల్‌వుడ్‌లో అత్యంత అభిమానించే హీరోల్లో యశ్ ముందువరుసలో ఉంటారు. తాజాగా ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా యశ్ భార్య రాధిక పండిట్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. దీంతో ఆయన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) రాధిక ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది మనమే.. మనం చాలా ఉల్లాసభరితంగా, గంభీరంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లవ్ యూ.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. వారిద్దరు ఎలా కలిశారంటే.. యశ్, రాధిక పండిట్ ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహం మొదలైంది. కొన్నేళ్లకు వారి స్నేహం ప్రేమగా మారి.. డిసెంబర్ 9, 2016న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప, బాబు జన్మించారు. వారి పిల్లలకు ఐరా, యతర్వ్ అని పేర్లు పెట్టారు. కాగా.. కేజీఎఫ్ 2 భారీ హిట్ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించారు యశ్. సినీ ప్రియులు కేజీఎఫ్ చాప్టర్- 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు నర్తన్‌తో కలిసి పని చేయనుండగా.. ఆ చిత్రానికి యశ్ -19 అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
రారాజుగా వస్తున్న యశ్
కేజీయఫ్ సీక్వెల్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొదాడు కన్నడ రాక్‌స్టార్ యశ్. దీంతో యశ్‌కు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో యశ్, ఆయన భార్య రాధిక పండిట్ జంటగా నటించిన ‘సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్’ కన్నడ చిత్రాన్ని తెలుగు రారాజుగా డబ్ చేస్తున్నారు. మహేష్ రావు దర్శకత్వంలో యశ్, రాధికా పండిట్లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కన్నడలో మంచి విజయం సాధించింది. ఇక ఈ చిత్రాన్ని వీఎస్ సుబ్బారావు ఈ నెల 14న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘యశ్, ఆయన సతీమణి రాధిక నటించిన ఈ చిత్రం కన్నడలో పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగు ట్రైలర్‌కు, లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటున్న యశ్ తనయుడు, ఏమైందంటే..
కేజీయఫ్ సీక్వెల్‌తో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు కన్నడ రాక్‌స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీయఫ్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 వేయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో యశ్ రాఖీ భాయ్ అనే మైనింగ్ స్మగ్లర్‌గా కనిపించాడు. ఇందులో పలు సన్నివేశాల్లో తనిన తాను బ్యాడ్ బాయ్‌గా యశ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. చదవండి: నటుడితో డేటింగ్, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్ ఇదిలా ఉంటే తాజాగా ‘డాడీ బ్యాడ్ బాయ్’ అంటూ యశ్ తనయుడు అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం యశ్ విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో పిల్లలతో సరదగా గడుపుతున్నాడు. కూతురు ఐరా, కుమారుడు యథర్వ్‌తో కలిసి సరదగా ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోలను తరచూ ఆయన భార్య రాధిక పండిట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మురిసిపోతుంది. ఇప్పుడు తాజాగా తనయుడు యథర్వ్ క్యూట్ వీడియో ఒకటి పంచుకుంది. ఇందులో తనయుడిని యశ్ ఏడిపించినట్టుగా ఉన్నాడు. చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు యశ్‌ను యథర్వ్ బ్యాడ్ బాయ్ అంటుంటే లేదు గుడ్ బాయ్ అంటూ కొడుకుతో వాదిస్తుంటాడు ‘రాఖీ భాయ్’. అయినా యథర్వ్ డాడీ బ్యాడ్ బాయ్ అంటుంటాడు. లేదు డాడీ గుడ్ అని యశ్ అంటుంటే ‘నో డాడీ బ్యాడ్.. మిమ్మి గుడ్’ అంటూ యథర్వ్ ఏడుస్తూ క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతున్న వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్ట్ నెటిజ్లను రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘యథర్వ్ అమ్మ కొడకు’, ‘యథర్వ్ సో క్యూట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కేజీయఫ్ చిత్రంలోని రాఖీ భాయ్ డైలాగ్‌ను ఈ సందర్భంగా ఈ సంఘటనకు ఆపాదిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇక యశ్ ఫ్యాన్స్ ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
భార్యతో కలిసి నటించిన యశ్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
Yash Raraju Movie Trailer Launched By VV Vinayak: ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘సంతు: స్ట్రయిట్ ఫార్వార్డ్’. మహేశ్ రావు దర్శకుడు. ఈ సినిమాను సుబ్బారావు తెలుగులో ‘రారాజు’గా జూన్ ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ – ‘‘పాతికేళ్లుగా పద్మావతి పిక్చర్స్‌పై సుబ్బారావుగారు ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. ఇప్పుడు యశ్ కేజీఎఫ్‌కు ముందు చేసిన ఈ సినిమాను తెలుగులో 'రారాజు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ‘‘యాక్షన్ ప్రధానాంగా సాగే చిత్రమిది. యశ్, ఆయన భార్య రాధిక పండిట్ కలిసి నటించారు. కన్నడంలో హిట్ సాధించినట్లే తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు నిర్మాత వీఎస్ సుబ్బారావు. ఈ చిత్రంలో కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు నటించారు. ఈ మూవీ హరికృష్ణ సంగీతం అందించగా, ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తెలుగులో రిలీజ్ కానున్న యశ్ సూపర్ హిట్ సినిమా
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ ‘రారాజు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహేష్ రావు దర్శకత్వంలో యశ్, రాధికా పండిట్ జంటగా నటించిన చిత్రం ‘సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్’. కె.మంజు నిర్మించిన ఈ కన్నడ చిత్రాన్ని ఇప్పుడు ‘రారాజు’ పేరుతో పద్మావతి పిక్చర్స్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత వీఎస్.సుబ్బారావు మాట్లాడుతూ– ‘‘యశ్, ఆయన సతీమణి రాధికా పండిట్ జంటగా నటించిన ఈ చిత్రం కన్నడలో మంచి హిట్ అయ్యింది. ఈ మూవీని ‘రారాజు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్‌ని త్వరలో విడుదల చేస్తాం. ఈ చిత్రాన్ని అతి త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘కిక్’ శ్యామ్, సీత, రవిశంకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: హరికృష్ణ, కెమెరా: ఆండ్రూ. -
భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యశ్.. ఫోటోలు వైరల్
కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కెరీర్‌నే మలుపుతిప్పిన సినిమా ఇది. ఈ సినిమా సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్-2 కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే మొన్నటివరకు షూటింగ్లో ఫుల్ బిజీగా గడిపిన యశ్ తన భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్ భార్య రాధిక పండిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పబ్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి భర్తతో కనిపించిన నిహారిక View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
కొత్త ఇంటికి మారిన యశ్ దంపతులు, ఫొటోలు వైరల్
కన్నడ రాక్‌స్టార్ యశ్ దంపతులు కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. శుక్రవారం ఉదయం యశ్ దంపతులు గృహ ప్రవేశ వేడుకను నిర్వహించి కుటుంబ సమేతంగా కొత్తింటిటోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ప్ అపార్టుమెంట్లో యశ్ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ మేరకు యశ్ దంపుతులు నూతన గృహ ప్రవేశం చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో యశ్, రాధికల తల్లిదండ్రులు, అంత్యంత సన్నిహితులు, కొద్ది మంది బంధువులు మాత్రమే పాల్గొన్నారు. కాగా యశ్ నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ విడుదలకు సిద్దమవుతుంది. దీంతో ప్రస్తుతం అతడు ఈ సిక్వెల్ రిలీజ్లో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ మూవీ కన్నడ, హిందీ, తెలుగు, తమిళ బాషల్లో విడుదల కానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యశ్‌కు భార్య రాధికా బర్త్‌డే విషెస్
కన్నడ స్టార్ హీరో యశ్ నేడు(శుక్రవారం) 35వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి రాధికా పండిట్ సోషల్ మీడియా వేదికగా భర్తకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే మై బెస్టీ అంటూ కేకు తినిపించుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు. పలువురు సెలబబ్రిటీలు సైతం ఈ రాకింగ్ స్టార్‌కు విషెస్ తెలుపుతున్నారు. ఇక రాఖీ భాయ్ బర్త్‌డే సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కేజీఎఫ్ 2 సినిమా టీజర్ ఒకరోజు ముందే విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతూ సోషల్ మీడియాను శాసిస్తోంది. కాగా యశ్‌కు తొలుత సీరియల్స్‌లో ఛాన్స్ రాగా తరువాత సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. 2008లో రాధిక పండిట్ సరసన 'మొగ్గిన మనసు' చిత్రంతో సినిమాల్లో అడుగు పెట్టారు. ఇది సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు యశ్‌కు ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. తర్వాత 2016లో తన తొలి సినిమా హీరోయిన్ రాధికానే పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐరా అనే కూతురు, అధర్వ్ అనే కొడుకు ఉన్నారు. (చదవండి: యశ్ గురించి ఆసక్తికరమైన విషయాలు) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) To an inspiring person, admirable journey, an epitome of self made success, Happy Birthday dearest @TheNameIsYash 🎉 May you reach unprecedented heights and glory with all your hard work and determination 🙏#HappyBirthdayRockyBhai pic.twitter.com/CSEH4G6UpW — PVP (@PrasadVPotluri) January 8, 2021 Happy Birthday my Rocky @TheNameIsYash HISTORY REPEATS !!!!! Will continue with us🔥#KGFChapter2Teaser@VKiragandur @hombalefilms pic.twitter.com/eI8FlIQVMX — Prashanth Neel (@prashanth_neel) January 7, 2021 -
థాంక్యూ డియర్ హజ్బెండ్: రాధిక
కన్నడ స్టార్ యశ్ , రాధిక పండిత్‌ల పెళ్లిబంధానికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా బుధవారం బెంగుళూరులోని తమ నివాసంలో యానివర్సిరీ వేడుకలను జరుపుకున్నారు. కరోనా కారణంగా చాలా సింపుల్‌గా ఈ సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను రాధిక పండిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..థ్యాంక్యూ డియర్ హజ్బెంట్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. వెడ్డింగ్ డే రోజును మరింత స్పెషల్‌గా చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు. యశ్ -రాధిక నాలుగో వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 2007లో నందగోకులా అనే టెలివిజన్ సీరియల్లో నటించే సమయంలోనే యశ్- రాధిక ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత డేటింగ్ అనంతరం 2016 డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు యాథర్వ్, కూతురు ఐరా ఉన్నారు. (ఐరా, యశ్‌ల ఐస్‌క్రీమ్ వీడియో వైరల్) ఇక సినిమాల విషయానికి వస్తే యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియన్ చిత్రం ‘కేజీయఫ్’. ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. యశ్‌కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కేజీయఫ్’ రెండో భాగం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ఇటీవల ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. 'కేజీయఫ్ 2’ టీజర్‌ను యశ్ బర్త్‌డే సందర్భంగా జనవరి 8న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. (కేజీఎఫ్.. ఛాప్టర్: 2: అధీరా రెడీ..) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) . -
జూనియర్ రాఖీభాయ్
‘బాహుబలి’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్ యష్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నారు యష్. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి కరోనావల్ల లాక్డౌన్ అయ్యింది. దాంతో అప్పుడు జరగాల్సిన వేడుకను వాయిదా వేశారు. సోమవారం బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను నిర్వహించారు యష్. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలో బాబుకి య«థర్వ యష్ అని పేరు పెట్టారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులు ‘జూనియర్ రాఖీ భాయ్‌కి శుభాకాంక్షలు’ అని కామెంట్స్పెట్టారు. ‘కేజీఎఫ్’లో యష్ చేసిన పాత్ర పేరు రాఖీ భాయ్ అనే సంగతి తెలిసిందే. -
ఇన్నాళ్లకు కొడుకును చూపించిన హీరో
సాధారణంగా సెలబ్రిటీలు ఏ చిన్న విషయాన్నైనా సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ లిస్టులో "కేజీఎఫ్" చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ కూడా ఉన్నాడు. అయితే అక్టోబర్ 30న యశ్ దంపతులకు జన్మించిన కొడుకు ఫొటో మాత్రం ఇప్పటివరకు పంచుకోలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత ఆ ఆ బుడ్డోడిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైనట్లుంది. తన గారాల కొడుకు ఫొటోను కేజీఎఫ్ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా అయితే అప్పటి నుంచి అతని ముఖాన్ని ఇంతవరకు చూపించనేలేదు. ఆరు మాసాల అనంతరం యశ్ దంపతులు బాబుతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "చిన్నోడికి హాయ్ చెప్పండి.. మీ ఆశీర్వచనాలు అందించడి" అని వారు పేర్కొన్నారు. (‘నాన్నా.. ఇది సమ్మర్ అని నాకు తెలుసు’) View this post on Instagram The moment all of you waiting for.... Yes Tomorrow, junior turn 6 months!! He will be ready to greet u all.... Are you guys ready for him!! 🤗 PS : Thanks Amrita for this memorable shoot! @mommyshotsbyamrita . . Follow @radhika_pandith_official Follow @radhika_pandith_official @iamradhikapandit @thenameisyash @nandiniarunkumar21 @sahlovesrayray @gourangpandit @toothless_rex #nimmaRP #rockingqueen #radhika_pandit_official #radhikapandit #radhu #iamradhikapandit #yash #thenameisyash #sandalwood_official #sandalwood #kgfmovie #nimmayash #ayrayash A post shared by Radhika_pandit (@radhika_pandith_official) on Apr 29, 2020 at 9:28am PDT ఎంతో క్యూట్‌గా ముద్దులొలుకుతున్న బాబును చూసి జూనియర్ యశ్ అదుర్స్ అంటూ కితాబిస్తున్నారు. ఇదిలా వుండగా యశ్ నటనపై పిచ్చితో రూ.300 తీసుకుని ఇంటి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. టీ ఇవ్వడం నుంచి ప్రతీ పని చేస్తూ అవకాశం కోసం ఎదురు చూశాడు. అలా ఓరోజు స్టేజీపై ప్రదర్శన ఇస్తుండగా ఆయన ప్రతిభను గుర్తించి సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా సినిమాల్లో నటిస్తున్న సమయంలో రాధికతో ప్రేమలో పడి 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది వయసున్న కూతురు ఐరాతో పాటు ఆరు నెలల బాబు ఉన్నాడు. ఇప్పటివరకు ఆ చిన్నోడికి ఇంకా పేరు పెట్టలేదు(రెండోసారి తండ్రి అయిన స్టార్ హీరో) View this post on Instagram Say hello to my little buddy for life ❤ 😎 do give him all your love and blessings🙂🙏 ನಿಮ್ಮ ಪ್ರೀತಿ... ಆಶೀರ್ವಾದ.. ಹಾರೈಕೆ... ಸದಾ ಈ ನನ್ನ ಪುಟ್ಟ ಕಂದನ ಮೇಲಿರಲಿ🙏❤️ A post shared by Yash (@thenameisyash) on Apr 30, 2020 at 3:53am PDT -
‘నాన్నా.. ఇది సమ్మర్ అని నాకు తెలుసు’
కేజీఎఫ్ స్టార్ యశ్, ఆయన భార్య రాధికా పండిట్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే ఈ స్టార్ కపుల్ తమకు సంబంధించిన అప్డేట్స్ను అభిమానులతో పంచుకుంటారు. కాగా బుధవారం మైసూరు జిల్లాలోని నంజనగూడిలోని శ్రీకంఠేశ్వర ఆలయంలో యశ్ దంపతులు తమ కూతురు ఐరాకు కేశ ఖండన చేయించారు. ఈ క్రమంలో యశ్ ఐరాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. గుండుతో ఉన్న ఐరా తండ్రిని కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోకు... ‘‘ ఐరా: నాన్నా.. ఇది సమ్మర్ అని నాకు తెలుసు.. కానీ ఇది సమ్మర్ కట్ కాదని కచ్చితంగా చెప్పగలను!!! డాడ్: పర్లేదు.. నాన్నా!!’’అంటూ క్యాప్షన్‌ను జతచేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే 8 లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ తండ్రీ, కూతుళ్ల ‘సంభాషణ’కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘ఐరా కూడా మీలాగే ఎంతో క్యూట్‌గా ఉంది. తనలా ముద్దుముద్దుగా మాట్లాడితే వినాలని ఉంది’’అని అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా కేజీఎఫ్ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్.. ప్రస్తుతం కేజీఎఫ్: చాప్టర్ 2తో బిజీగా ఉన్నాడు. ప్రాణాంతక వైరస్ కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చిన ఈ కన్నడ హీరో.. వ్యక్తిగత శుభ్రత పాటించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో ఇటీవల తన భార్య రాధిక 35 పుట్టినరోజు సందర్బంగా వేడుకలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించాడు. కాగా వివిధ సినిమాల్లో కలిసి నటించిన యశ్- రాధిక 2016లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు ఐరా, ఓ కొడుకు సంతానం. View this post on Instagram Ayra : Dad I know its summer... but I'm damn sure THIS is NOT summer cut!!! Dad : Well... ahem!! 😬 A post shared by Yash (@thenameisyash) on Mar 11, 2020 at 2:43am PDT -
ఈసారి నో సెలబ్రేషన్స్: హీరో యశ్
ఈ ఏడాది తన భార్య రాధికా పండిట్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని కన్నడ రాక్‌స్టార్, కేజీఎఫ్ హీరో యశ్ తెలిపారు. ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. అప్పుడే ప్రమాదకరమైన వైరస్ బారిన పడకుండా ఉంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమాతో బిజీగా ఉన్న యశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. షేక్‌హ్యాండ్ బదులు నమస్తే చెప్పాలని.. జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సూచనలు, సలహాలు పాటించాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టేంతవరకు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాధిక బర్త్‌డే సెలబ్రేషన్స్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా యశ్ భార్య, కన్నడ హీరోయిన్ నేడు 35వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు రాధికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఇక పలు సినిమాల్లో కలిసి నటించిన యశ్- రాధిక 2016లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి కూతురు ఐరా, కొడుకు సంతానం. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) on Mar 6, 2020 at 9:15am PST -
యష్‌కు సర్ప్రైజ్ విషెస్..
-
యష్‌కు సర్ప్రైజ్ విషెస్..
హీరో యష్ బుధవారం 34వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్ర బృందం కూడా ఆ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే యష్ భార్య రాధిక, కుమార్తె అయిరా యష్‌కు సర్ప్రైజ్ బర్త్ డే విషేస్ తెలిపారు. యష్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఆయనకు విషెస్ చెప్పిన రాధిక.. కుమార్తె అయిరా కలిసి కేక్ తయారు చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ‘సర్ప్రైజ్.. మేము నీ జీవితంలో చోటు సంపాదించుకున్నట్టే.. నీ అకౌంట్‌ను కూడా తీసుకున్నాం. బిగ్గెస్ట్ ఫ్యాన్స్ నుంచి వన్ అండ్ ఓన్లీ రాక్‌స్టార్‌కు హ్యాపీ బర్త్ డే’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో.. రాధిక కేక్ తయారు చేస్తూ యష్‌కు విషెస్ చెబుతుంటే.. అయిరా కేక్‌తో ఆడుకుంటూ క్యూట్ క్యూట్‌గా అల్లరి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా, యష్, రాధికలు 2016లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి 2018లో పాప, గతేడాది బాబు జన్మించారు. -
రెండోసారి తండ్రి అయిన స్టార్ హీరో
కేజీఎఫ్ స్టార్, కన్నడ హీరో యశ్ రెండోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య, హీరోయిన్ రాధికా పండిట్ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సాండల్‌వుడ్ స్టార్ కపుల్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘జూనియర్ యశ్ వచ్చేశాడు’ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. కాగా ఈ జంటకు ఇప్పటికే ఐరా(11 నెలలు) అనే ఆడబిడ్డ ఉన్న సంగతి తెలిసిందే. ఇక పలుచిత్రాల్లో కలిసి నటించిన యశ్- రాధిక 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యశ్ గతేడాది విడుదలైన కేజీఎఫ్ సినిమాతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కన్నడతో పాటు వివిధ భాషల్లో రిలీజైన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించడంతో పాటుగా దేశ వ్యాప్తంగా యశ్‌కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కేజీఎఫ్-2 తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నాడు. -
‘తండ్రీ కూతుళ్లు ఇప్పుడు బాగానే ఉన్నారు’
పిల్లలకు సంబంధించిన ప్రతీ వేడుక తమ సమక్షంలోనే జరగాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. మిగతా రోజుల్లో బిజీగా ఉన్నా ప్రత్యేకమైన రోజున పిల్లలతో గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తారు. సెలబ్రిటీలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఇక ఫ్యామిలీ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించే కేజీఎఫ్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కూతురు ఐరా పుట్టిన నాటి నుంచి ఆమెను ముద్దు చేస్తూ తనతోనే గడుపుతున్నాడు. యశ్ భార్య, కన్నడ హీరోయిన్ రాధికా పండిట్ ఈ తండ్రీ కూతుళ్ల ఫొటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఐరా(8 నెలలు)కు చెవులు కుట్టించారు ఈ జంట. ఈ క్రమంలో చెవి దుద్దులతో మురిసిపోతున్న ఐరాను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన రాధిక...‘ ఐరాకు కర్ణవేదన కార్యక్రమం చేశాం. ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో ఎదురయ్యే కఠినమైన సమయం ఇదేననుకుంటా. చెవులు కుట్టించేపుడు తను చాలా ఏడ్చింది. దీంతో మా గుండె పగిలినట్లయింది. రాక్‌స్టార్ కళ్లలో మొట్టమొదటిసారి నీళ్లు తిరగడం చూశాను. బంధాలు ఎంత విలువైనవో నాకు ఆ క్షణమే పూర్తిగా అర్థమైంది. అయితే ఇంకో విషయం ఇప్పుడు తండ్రీకూతుళ్లిద్దరూ బాగానే ఉన్నారు’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ క్రమంలో ఐరా క్యూట్ ఫొటోపై స్పందించిన యశ్ అభిమానులు.. ఆ సమయంలో యశ్ హృదయం ఎంత విలవిల్లాడిందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కన్నడ హీరో అయిన యశ్ కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. View this post on Instagram We got Ayra's ears pierced.. one of the most difficult things to witness in life as parents. Our hearts broke to see her cry so much! For the very first time I saw tears in Rocking Star's eyes.. made me realise how precious these bonds are ♥️ Not to worry both dad and daughter are doing fine now!! 😛 @thenameisyash #radhikapandit #nimmaRP A post shared by Radhika Pandit (@iamradhikapandit) on Aug 26, 2019 at 9:57pm PDT -
వెల కట్టలేని ప్రేమ
కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సహాయగుణం, ప్రేమ గుణం గురించి గొప్పగా చెబుతారు ఆయన సన్నిహితులు. ఆయన ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్ చనిపోయినా కూడా తన ప్రేమను పంచుతూనే ఉన్నారు. కన్నడ యంగ్ హీరో యష్ భార్య రాధికా పండిట్ ఓ పాపకు జన్మ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు ఓ ఊయల గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారట అంబరీష్. సుమారు లక్షన్నర విలువ చేసే ఈ ఊయలను ఆన్లైన్లో బుక్ చేశారాయన. యష్‌కు పాప జన్మించేలోపే అంబరీష్ చనిపోయారు. బుక్ చేసిన ఈ ఊయలకు సంబంధించిన మెసేజ్ రావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్నారు అంబరీష్ భార్య సుమలత. ఈ గిఫ్ట్‌ను యష్ కూతురికి అందిం చారామె. ఈ ఊయల తమకు అపురూపం అని యష్ దంపతులు పేర్కొన్నారు. -
తండ్రి కాబోతున్న హీరో
యశవంతపుర : శాండల్ వుడ్ రాకింగ్‌స్టార్ యశ్, రాధికా పండిత్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని యష్ తన అభిమానులతో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. మేము ఇద్దరం కాదు. ముగ్గరం అంటూ పోస్టు ఫేస్బుక్లో పోస్టు చేశారు. యశ్ తల్లి కూడా తాను అవ్వను కాబోతున్నట్లు ఆనంద వ్యక్తం చేసింది. -
ఇంటి వాడు కానున్న యశ్
బెంగళూరు: శాండల్‌వుడ్‌లో హిట్ పెయిర్‌గా పేరుగాంచిన యశ్, రాధికా పండిట్లు వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు(ఆగస్ట్12) ఉదయం పది గంటలకు వీరిద్దరి నిశ్చితార్థం గోవాలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబానికి ఆప్తులైన వారిని మాత్రమే ఆహ్వానించినట్లు యశ్ తెలపారు. కాగా వీరిద్దరు నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం విధితమే. కాగా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరువురు దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతుండడం ఆనందంగా ఉందని శాండల్ఉడ్లోని పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరన వీరిద్దరి వివాహం జరగనుందని కుటుంబ సభ్యులు తెలిపారు.


