థాంక్యూ డియర్‌ హజ్బెండ్‌: రాధిక | Radhika Pandit Shares Photo With Yash On wedding Anniversary | Sakshi
Sakshi News home page

పెళ్లిరోజు జరుపుకొన్న యశ్‌ జంట

Dec 10 2020 5:10 PM | Updated on Dec 10 2020 5:13 PM

Radhika Pandit Shares Photo With Yash On wedding Anniversary - Sakshi

కన్నడ స్టార్‌ యశ్‌ , రాధిక పండిత్‌ల పెళ్లిబంధానికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా బుధవారం బెంగుళూరులోని తమ నివాసంలో యానివర్సిరీ వేడుకలను జరుపుకున్నారు. కరోనా కారణంగా చాలా సింపుల్‌గా ఈ సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను రాధిక పండిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..థ్యాంక్యూ డియర్‌ హజ్బెంట్‌ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. వెడ్డింగ్‌ డే రోజును మరింత స్పెషల్‌గా చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ చేశారు. యశ్‌ -రాధిక నాలుగో వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 2007లో నందగోకులా అనే టెలివిజన్‌ సీరియల్‌లో నటించే సమయంలోనే యశ్‌- రాధిక ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత డేటింగ్‌ అనంతరం 2016 డిసెంబర్‌ 9న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు యాథర్వ్‌, కూతురు ఐరా ఉన్నారు.  (ఐరా, యశ్‌ల ఐస్‌క్రీమ్‌ వీడియో వైరల్‌)

ఇక సినిమాల విషయానికి వస్తే యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్‌ ఇండియన్‌ చిత్రం ‘కేజీయఫ్‌’. ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. యశ్‌కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌’  రెండో భాగం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.  కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ఇటీవల ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుపుకుంటుంది. 'కేజీయఫ్‌ 2’ టీజర్‌ను యశ్‌ బర్త్‌డే సందర్భంగా  జనవరి 8న విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. (కేజీఎఫ్‌.. ఛాప్టర్‌: 2: అధీరా రెడీ..)

.

Advertisement
 
Advertisement
Advertisement