వెల కట్టలేని ప్రేమ

Late actor Ambareesh gifts a cradle to Yash and Radhika Pandith baby girl - Sakshi

కన్నడ రెబల్‌ స్టార్‌ అంబరీష్‌ సహాయగుణం, ప్రేమ గుణం గురించి గొప్పగా చెబుతారు ఆయన సన్నిహితులు. ఆయన ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్‌ చనిపోయినా కూడా తన ప్రేమను పంచుతూనే ఉన్నారు.  కన్నడ యంగ్‌ హీరో యష్‌ భార్య రాధికా పండిట్‌ ఓ పాపకు జన్మ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు ఓ ఊయల గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారట అంబరీష్‌. సుమారు లక్షన్నర విలువ చేసే ఈ ఊయలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేశారాయన. యష్‌కు పాప జన్మించేలోపే అంబరీష్‌ చనిపోయారు. బుక్‌ చేసిన ఈ ఊయలకు సంబంధించిన మెసేజ్‌ రావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్నారు అంబరీష్‌ భార్య సుమలత. ఈ గిఫ్ట్‌ను యష్‌ కూతురికి అందిం చారామె. ఈ ఊయల తమకు అపురూపం అని యష్‌ దంపతులు పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top