జూనియర్‌ రాఖీభాయ్‌ | Rockstar Yash Named His Son As Yatharv Yash | Sakshi
Sakshi News home page

జూనియర్‌ రాఖీభాయ్‌

Sep 2 2020 3:04 AM | Updated on Sep 2 2020 5:31 AM

Rockstar Yash Named His Son As Yatharv Yash - Sakshi

‘బాహుబలి’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్‌’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్‌ యష్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నారు యష్‌. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్‌ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి కరోనావల్ల లాక్‌డౌన్‌ అయ్యింది. దాంతో అప్పుడు జరగాల్సిన వేడుకను వాయిదా వేశారు. సోమవారం బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను నిర్వహించారు యష్‌. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలో బాబుకి య«థర్వ యష్‌ అని పేరు పెట్టారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, అభిమానులు ‘జూనియర్‌ రాఖీ భాయ్‌కి శుభాకాంక్షలు’ అని కామెంట్స్‌పెట్టారు. ‘కేజీఎఫ్‌’లో యష్‌ చేసిన పాత్ర పేరు రాఖీ భాయ్‌ అనే సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement