breaking news
Kritika Kamra
-
రూమర్స్ నిజం చేశారు.. డేటింగ్‌పై నటి కృతిక క్లారిటీ
స్వతహాగా టీవీ నటుడు అయినప్పటికీ ఐపీఎల్లో హోస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ కపూర్ ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డాడు. గత కొన్నాళ్లుగా ఇతడి గురించి రూమర్స్ వస్తున్నప్పటికీ తాజాగా వాటిపై క్లారిటీ వచ్చేసింది. గౌరవ్ ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నాడని పుకార్లు వచ్చాయో సదరు నటి.. ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. దీంతో కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: అమ్మ ఆశీర్వదించింది.. భగవంతుడు నిజం చేశాడు: పూర్ణ)రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన గౌరవ్ కపూర్.. కొన్ని హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కాకపోతే 2008లో ప్రారంభమైన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో హోస్ట్‌గా చేసిన తర్వాత చాలా గుర్తింపు వచ్చింది. అలా 2017 వరకు ఈ లీగ్‌లో హోస్టింగ్ చేశాడు. ప్రస్తుతం క్రిక్‌బజ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు వ్యాఖ్యతగా పనిచేస్తున్నాడు.గతంలోనే నటి కిరాట్ బట్టల్ అనే నటిని గౌరవ్, 2014లో పెళ్లి చేసుకున్నాడు. కానీ 2021లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా గౌరవ్ ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కృతిక కమ్రా అనే నటితో గౌరవ్ డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కృతికనే ఇన్ స్టాలో గౌరవ్‌తో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో బంధం అధికారికం చేసేశారని మాట్లాడుకుంటున్నారు. 37 ఏళ్ల కృతిక ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: సినిమాల్లో అవకాశాలు లేవ్.. చాలా బాధపడ్డా!: నటి ప్రగతి) View this post on Instagram A post shared by Kritika Kamra (@kkamra) -
పెద్ద సినిమాలో ఆఫర్ లైట్ తీసుకున్నా.. కట్ చేస్తే అది బ్లాక్‌బస్టర్!
తనకు వచ్చిన ప్రతి ఆఫర్‌కు బదులుగా అందులో ది బెస్ట్‌నే ఎంపిక చేసుకుంటానంటోంది బ్యూటీ కృతిక కమ్ర. తన పాత్రకు కొద్దోగొప్పో ప్రాముఖ్యత లేకపోతే ఆ సినిమా చేసే ప్రసక్తే లేదని చెప్తోంది. ఈ క్రమంలో ఓ బడా నటుడి సినిమా కూడా రిజెక్ట్ చేశానంటోంది.పెద్ద సినిమాలో ఛాన్స్..కృతిక మాట్లాడుతూ.. స్క్రిప్ట్ నచ్చకపోతే నేను సంతకం చేయను. అలా చాలా వదులుకున్నాను. ఓసారైతే పెద్ద హీరోతో నటించే ఛాన్స్ వచ్చింది. అందులో నా పాత్రకు పెద్ద స్కోప్ లేకపోవడంతో లైట్ తీసుకున్నాను, కానీ తర్వాత అది బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దీనివల్ల హీరోయిన్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కాబట్టి మంచి అవకాశం చేజారిపోయిందేంటబ్బా.. అని ఎన్నడూ బాధపడలేదు అని చెప్పుకొచ్చింది.ఓటీటీలో..బుల్లితెర నటి కృతిక కిత్నీ మొహబ్బత్ హై, ప్యార్ కా బంధన్, వి ద సీరియల్, కుచ్ తో లోగ్ కహేంగే సీరియల్స్‌లో నటించింది. మిత్రాన్, భీద్ సినిమాల్లో తళుక్కుమని మెరిసిన ఈ బ్యూటీ హుష్ హుష్, బొంబాయ్ మేరీ జాన్, గ్యారా గ్యారా వెబ్ సిరీస్‌లతో ఓటీటీలో మెప్పించింది. -
Kritika Kamra: బాలీవుడ్ బ్యూటీ కృతిక కమ్రా అదిరిపోయే పోజులు (ఫోటోలు)
-
బాలీవుడ్లో వివక్షను ఎదుర్కొన్నా: 'తాండవ్' నటి
వివక్ష చూపినప్పటికీ తన ప్రతిభనే నమ్ముకుంది. అందుకే అతికొద్ది కాలంలోనే బుల్లితెర నటి నుంచి వెండితెర నటిగా ఎదిగి, సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా, గౌహర్ ఖాన్ వంటి స్టార్స్ మధ్యలో నటించే అవకాశం దక్కించుకుంది కృతికా కమ్రా. రాజకీయ వెబ్ సిరీస్ ‘తాండవ్’తో వెబ్ వీక్షకులూ అభిమాన నటి అయింది. కృతికా కమ్రా మధ్యప్రదేశ్‌లోని బరేలీలో 1988 అక్టోబర్ 25న జన్మించింది. తండ్రి రవి కమ్రా..డాక్టర్, తల్లి కుమ్కుమ్ కమ్రా, తమ్ముడు రాహుల్ కమ్రా. 2007లో ‘యహా కే హమ్ సికందర్’ అనే టీవీ షోతో ఇండ్రస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు చేశారు. కృతి ముందు ఫ్యాషన్ డిజైనర్‌గా రాణించాలనుకుంది. కానీ, ‘కిత్నీ మొహబ్బత్ హై’ సీరియల్లో లీడ్రోల్లో అవకాశం రావడంతో కోర్సును మధ్యలోనే వదిలేసింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సీరియల్లోని అరోహీ పాత్రను ప్రేక్షకులు తమ సొంత అమ్మాయిలాగా ఆదరించడంతో బాగా ప్రాచుర్యం పొందారు. 2014లో ‘ఝలక్ దిఖ్లాజా 7’ అనే రియాల్టీ షోలోనూ పాల్గొంది. ఆ తర్వాత 2015లో ‘ఎమ్‌టీవీ వెబ్డ్ సీజన్2’లో హోస్ట్‌గా చేశారు. 2018లో మొదటిసారిగా బుల్లితెర నుంచి బాలీవుడ్‌లోకి ‘మిత్రోం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే, మిత్రోంతో పాటు ఆ తర్వాత నటించిన జాకీ భగ్నాని, ప్రతీక్ గాంధీ, నీరజ్ సూద్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు. కృతి ‘ప్యార్ కా బంధన్’, ‘గంగా కీ ధీజ్’, కిత్నీ మొహబ్బత్ హై2’, ‘రిపోర్టర్స్’, ‘ప్రేమ్ యా పహేలీ’, ‘చంద్రకాంత’ వంటి టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. వివిధ మ్యూజిక్ ఆల్బమ్స్‌ను సేకరించడం హాబీ. డాన్స్ అంటే చాలా ఇష్టం. బాలీవుడ్లో ఎంతోమంది నటులు ఎదుర్కొంటున్న వివిక్షను నేను కూడా అనుభవించాను. కానీ, అవేవీ నా ఈ ప్రయాణాన్ని ఆపలేదు. ఎందుకంటే అవకాశాలు అనేవి ప్రతిభ ఉంటేనే వస్తాయని నేను నమ్ముతాను. (చదవండి: అమ్మతో సమయం గడపండి: అర్జున్ కపూర్) -
ప్రియుడికి టీవీ నటి గుడ్ బై
ముంబై: ప్రముఖ హిందీ టీవీ నటి కృతికా కర్మా తన బాయ్ ఫ్రెండ్ తో తెగతెంపులు చేసుకుంది. ఏడాదిన్నరగా కార్పొరేట్ ప్రొఫెనషల్ సిద్దార్థ్ బిజపూరియాతో సహజీవనం సాగించిన కృతిక అతడికి గుడ్ బై చెప్పింది. ఖర్ ప్రాంతంలోని తన అపార్ట్ మెంట్ నుంచి మరో ఫ్లాట్ కు సిద్ధార్థ్ మారిపోయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే వీరి బ్రేకప్ కు కారణాలు వెల్లడికాలేదు. 'కృతిక, సిద్దార్థ్ చాలా సంతోషంగా ఉండేవారు. వీరిద్దరూ విడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. సెలవుల్లో ఇద్దరూ ఎంతో సరదాగా గడిపారు. సిద్దార్థ్ ఇంట్లో జరిగే ఫ్యామిలీ ఫంక్షన్లకు ఆమె హాజరయ్యేది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు కనబడేవారు. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో తెలియదు. కారణం వాళ్లిద్దరికే తెలియాలి' అని విశ్వసనీయ వర్గాలు వివరించాయి.


