పెద్ద సినిమాలో ఆఫర్‌ లైట్‌ తీసుకున్నా.. కట్‌ చేస్తే అది బ్లాక్‌బస్టర్‌! | Kritika Kamra: Once Rejected Film with a Big Actor, I Do Not Regret It | Sakshi
Sakshi News home page

నేను కాదనుకున్న ఆఫర్లు బోలెడు.. పెద్ద హీరో సినిమా కూడా రిజెక్ట్‌ చేశా..

Aug 26 2024 4:17 PM | Updated on Aug 26 2024 4:36 PM

Kritika Kamra: Once Rejected Film with a Big Actor, I Do Not Regret It

తనకు వచ్చిన ప్రతి ఆఫర్‌కు బదులుగా అందులో ది బెస్ట్‌నే ఎంపిక చేసుకుంటానంటోంది బ్యూటీ కృతిక కమ్ర. తన పాత్రకు కొద్దోగొప్పో ప్రాముఖ్యత లేకపోతే ఆ సినిమా చేసే ప్రసక్తే లేదని చెప్తోంది. ఈ క్రమంలో ఓ బడా నటుడి సినిమా కూడా రిజెక్ట్‌ చేశానంటోంది.

పెద్ద సినిమాలో ఛాన్స్‌..
కృతిక మాట్లాడుతూ.. స్క్రిప్ట్‌ నచ్చకపోతే నేను సంతకం చేయను. అలా చాలా వదులుకున్నాను. ఓసారైతే పెద్ద హీరోతో నటించే ఛాన్స్‌ వచ్చింది. అందులో నా పాత్రకు పెద్ద స్కోప్‌ లేకపోవడంతో లైట్‌ తీసుకున్నాను, కానీ తర్వాత అది బ్లాక్‌బస్టర్‌ హిట్టయింది. దీనివల్ల హీరోయిన్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కాబట్టి మంచి అవకాశం చేజారిపోయిందేంటబ్బా.. అని ఎన్నడూ బాధపడలేదు అని చెప్పుకొచ్చింది.

ఓటీటీలో..
బుల్లితెర నటి కృతిక కిత్నీ మొహబ్బత్‌ హై, ప్యార్‌ కా బంధన్‌, వి ద సీరియల్‌, కుచ్‌ తో లోగ్‌ కహేంగే సీరియల్స్‌లో నటించింది. మిత్రాన్‌, భీద్‌ సినిమాల్లో తళుక్కుమని మెరిసిన ఈ బ్యూటీ హుష్‌ హుష్‌, బొంబాయ్‌ మేరీ జాన్‌, గ్యారా గ్యారా వెబ్‌ సిరీస్‌లతో ఓటీటీలో మెప్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement