breaking news
Gaurav Kapur show
-
రూమర్స్ నిజం చేశారు.. డేటింగ్‌పై నటి కృతిక క్లారిటీ
స్వతహాగా టీవీ నటుడు అయినప్పటికీ ఐపీఎల్లో హోస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ కపూర్ ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డాడు. గత కొన్నాళ్లుగా ఇతడి గురించి రూమర్స్ వస్తున్నప్పటికీ తాజాగా వాటిపై క్లారిటీ వచ్చేసింది. గౌరవ్ ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నాడని పుకార్లు వచ్చాయో సదరు నటి.. ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. దీంతో కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: అమ్మ ఆశీర్వదించింది.. భగవంతుడు నిజం చేశాడు: పూర్ణ)రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన గౌరవ్ కపూర్.. కొన్ని హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కాకపోతే 2008లో ప్రారంభమైన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో హోస్ట్‌గా చేసిన తర్వాత చాలా గుర్తింపు వచ్చింది. అలా 2017 వరకు ఈ లీగ్‌లో హోస్టింగ్ చేశాడు. ప్రస్తుతం క్రిక్‌బజ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు వ్యాఖ్యతగా పనిచేస్తున్నాడు.గతంలోనే నటి కిరాట్ బట్టల్ అనే నటిని గౌరవ్, 2014లో పెళ్లి చేసుకున్నాడు. కానీ 2021లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా గౌరవ్ ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కృతిక కమ్రా అనే నటితో గౌరవ్ డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కృతికనే ఇన్ స్టాలో గౌరవ్‌తో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో బంధం అధికారికం చేసేశారని మాట్లాడుకుంటున్నారు. 37 ఏళ్ల కృతిక ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: సినిమాల్లో అవకాశాలు లేవ్.. చాలా బాధపడ్డా!: నటి ప్రగతి) View this post on Instagram A post shared by Kritika Kamra (@kkamra) -
యువీని భయపెట్టే బౌలర్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు వణుకుతారు. అతడికి బౌలింగ్ చేయడానికి తటపటాయిస్తారు. ముఖ్యంగా ఇంగ్లీషు బౌలర్లు యువీ అంటే హడలిపోతారు. బౌండరీ, సిక్సర్లతో నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడే ఈ ఎడమచేతి బ్యాట్స్ మన్ తన కెరీర్ లో ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 2007 ట్వంటీ-20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు బాదడడం యువీ కెరీర్ లో హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్-10లో హైదరాబాద్ తరపున ఆడుతున్న తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అయితే తనను భయపెట్టే ఇంగ్లీషు బౌలర్ ఒకరు ఉన్నారని యువీ వెల్లడించాడు. గౌరవ్ కపూర్ షో ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’లో అతడీ విషయం వెల్లడించాడు. తాను ఎదుర్కొనలేని ఏకైక ఇంగ్లీషు బౌలర్ తన భార్య హజల్ కీచ్ అని సరదాగా చెప్పాడు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఆమె సంధించే బౌన్సర్లకు తన దగ్గర సమాధానం లేదని అన్నాడు. ఆమె బౌలింగ్ లో ఆడడం చాలా కష్టమన్నాడు. తనింట్లో ఆమే అంపైర్ అని వెల్లడించాడు. ఐపీఎల్ లో సత్తా మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలని యువరాజ్ భావిస్తున్నాడు.


