విశ్వక్ సేన్‌- అనుదీప్‌ మూవీ.. రిలీజ్ డేట్‌ ఫిక్స్ | Vishwak Sen Latest Movie Funky Release Date announced | Sakshi
Sakshi News home page

Funky Release Date: అన్‌లిమిటేడ్‌ ఫన్.. ఫంకీ రిలీజ్ ఎప్పుడంటే?

Nov 6 2025 4:51 PM | Updated on Nov 6 2025 6:13 PM

Vishwak Sen Latest Movie Funky Release Date announced

మాస్ కా దాస్‌గా పేరున్న టాలీవుడ్‌ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). మాస్ చిత్రాలతో పాటు కామెడీ ఎంటర్‌టైనర్లతోనూ మెప్పించారు. ఈ ఏడాది లైలా అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం మరో ఫుల్ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌ దర్శకత్వంలో వస్తోన్న మూవీ ఫంకీ(FUNKY). ఇప్పటికే టీజర్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కయాద్ లోహర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. 2026 ఏప్రిల్‌ 3న సమ్మర్‌లో థియేటర్లలో ఫంకీ సందడి చేయనుందని తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వీకే నరేశ్, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement