తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతారు: చిరంజీవి | Sakshi
Sakshi News home page

Laal Singh Chaddha: 'లాల్‌ సింగ్‌ చడ్డా'ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది

Published Sun, Aug 7 2022 8:08 PM

Laal Singh Chaddha Premiere: Megastar Chiranjeevi Amir khan Papped In Hyd - Sakshi

బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్‌ చడ్డా'. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్టైన ఫారెస్ట్ గంప్ చిత్రం ఆదారంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతకంపై ఈ సినిమాను నిర్మించారు.కరీనా కపూర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. అక్కినేని నాగ చైతన్య ఈ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలరాజుగా కీలకమైన పాత్రలో చై కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది.తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌ ఏఎమ్‌బి సినిమాస్‌లో నిర్వహించిన ప్రీమియర్‌ షో అట్టహాసంగా జరిగింది.ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవిగారు, మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్, కింగ్ అక్కినేని నాగార్జున‌, నాగ‌చైతన్య‌, మెగానిర్మాత అల్లు అర‌వింద్, యువ హీరోలు సాయితేజ్, అల్లు శిరీష్, కార్తికేయ‌, ద‌ర్శ‌కులు మారుతి, హ‌రీశ్ శంక‌ర్, నిర్మాత‌లు సురేశ్ బాబు త‌దిత‌రులు హ‌జ‌రయ్యారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. అమీర్‌ ఖాన్‌ లాంటి నటుడు దేశం గర్వించదగ్గ నటుడని కొనియాడారు. 'ఈ చిత్రంలో నాగ చైతన్య పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అలాగు లాల్‌ సింగ్‌ చడ్డాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మ‌నఃస్పూర్తిగా న‌మ్ముతున్నాను'అని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement