– కైకాల నాగేశ్వర రావు
చిరంజీవి హీరోగా, రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కొదమసింహం’. కె. మురళీమోహన రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 1990 ఆగస్టు 9న విడుదలై, ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేసి, నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కైకాల నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఒకవైపు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తూనే మరోవైపు ‘కొదమసింహం’ చేశారు. ఈ సినిమాని మంచి క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొదమసింహం’ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. రీ రిలీజ్‌ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అని మురళీమోహన్ రావు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సత్యానంద్ మాట్లాడారు.
ఆ క్యాసెట్ పెడితేనే చరణ్ భోజనం చేసేవాడు: చిరంజీవి
వీడియో ద్వారా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘కొదమసింహం’ నా ఫేవరెట్ మూవీ. నాకంటే రామ్‌చరణ్‌కి ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితేనే భోజనం చేసేవాడు. కృష్ణగారు చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ పెద్ద హిట్ అయింది. అలాంటి కౌబాయ్ సినిమా మళ్లీ చేయడం సాహసమే అవుతుంది. అయితే నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ రావు వచ్చి నాకు ‘కొదమసింహం’ కథ చెప్పగానే వెంటనే అంగీకారం తెలిపాను. ఈ సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్ మోహన్‌బాబు గారు చేసిన సుడిగాలి క్యారెక్టర్. ఆయన కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను ఇంత బాగా ఒప్పించి, మెప్పించి ఉండేవారు కాదు’’ అని చె΄్పారు.


