అల్లు అర్జున్‌ పుష్ప-2.. రిలీజ్‌కు ముందే ప్రభంజనం! | Allu Arjun Pushpa 2 Movie Pre Bookings Creates Record In USA | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: అల్లు అర్జున్‌ పుష్ప-2.. రిలీజ్‌కు ముందే భారీ రికార్డ్!

Nov 6 2024 1:12 PM | Updated on Nov 6 2024 1:24 PM

Allu Arjun Pushpa 2 Movie Pre Bookings Creates Record In USA

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2 ది రూల్'. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ డిసెంబర్ 5న పుష్పరాజ్‌ థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే నెల రోజల కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అయితే రిలీజ్‌కు ఇంకా నెల రోజులు సమయం ఉండడంతో వరుసగా అప్‌డేట్లతో మేకర్స్‌ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈ నెల 15న ట్రైలర్‌ భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే అందరికంటే ముందుగా ఓవర్‌సీస్‌లో పుష్ప-2 ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల రోజులు ముందుగానే టికెట్స్ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌తో రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా 15వేల టికెట్స్‌ అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్ ద్వారా పంచుకుంది. అమెరికాలో ఇంత వేగంగా టికెట్స్‌ అమ్ముడైన భారతీయ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌  ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

గ్రాండ్‌గా ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌..

పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ పెద్ద ప్లానింగే వేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దాదాపుగా ఈనెల 15న ట్రైలర్ విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇది కాకుండా బాహుబలి-2 తర్వాత అత్యధిక బజ్‌ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement