అల్లు అర్జున్ పుష్ప-2.. ఓవర్‌సీస్‌లో మరో రికార్డ్‌! | Allu Arjun Pushpa 2 Movie Creates New Record In USA Pre Sales Bookings | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: అల్లు అర్జున్ పుష్ప-2.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!

Nov 7 2024 2:09 PM | Updated on Nov 7 2024 3:04 PM

Allu Arjun Pushpa 2 Movie Creates New Record In USA Pre Sales Bookings

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నెల రోజుల ముందే పండుగ మొదలైంది. డిసెంబర్‌ 5న రిలీజవుతోన్న పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఎక్కడ చూసినా పుష్ప మానియా కనిపిస్తోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో ప్రీమియర్ షోస్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఒక్క అమెరికాలోనే రికార్డ్ స్థాయి బుకింగ్స్‌తో పుష్ప-2 దూసుకెళ్తోంది.

ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప-2.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. యూఎస్‌ ప్రీమియర్ షోస్‌ బుకింగ్స్‌లో క్రేజీ రికార్డ్ నమోదు చేసింది. అత్యంత వేగంగా 50 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా ఘనత సాధించింది. ఈ జాబితాలో అ‍త్యంత వేగంగా సాధించిన భారతీయ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఇంకా 28 రోజుల సమయం ఉండగా.. ముందు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్‌ ఉంది. కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement