
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju). ఈ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనుంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ ఛాన్స్ వస్తే చాలు ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది.
తాజాగా ఇవాళ దివాళీ కావడంతో మరో ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఫస్ట్ సాంగ్‌ను కూడా విడుదల చేస్తామని అప్‌డేట్ ఇచ్చారు. ఈ వీడియో ప్రోమోలో పటాకుల దుకాణంలో నవీన్ పొలిశెట్టి హీరోగా చేసిన హంగామా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అరే హ్యాపీ దివాళీ అన్న.. ఏం కావాలి అన్న.. ఏమీ దొరుకుతాయి ఇక్కడ అని కస్టమర్ అనగానే.. పట్టు చీరలు, శిల్క్ శారీలు అన్నీ ఉన్నాయి.. పటాకాయల షాపుకొచ్చి పట్టుచీరలు దొరుతుతాయా అన్నా అంటూ నవీన్ నవ్వులు పూయించాడు. ఎల్లన్న.. అంటే ఎలన్ మస్క్ ఎరికేనా నీకు.. మార్స్‌లో నీళ్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పంపించిన రాకెట్స్ ఇవే.. సేమ్ పీస్.. అందుకే వారంటీ కోసం మస్క్ ఫోటో కూడా వేయించా.. మీకు ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆయనకు ఫోన్ చేయుర్రి.. మనం నీళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాచ్‌మెన్‌ను పంపిస్తాం.. ఈ డబ్బులు ఉన్నోళ్లు ఏంది రాకెట్స్ పంపిస్తరు.. పైసలు ఉన్నోళ్ల పైత్యం లే.. అంటూ ప్రోమో ఫుల్ కామెడీతో అలరిస్తోంది.
కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు.
JaaneJigars. First song from #AnaganagaOkaRaju BLASTING SOON 🔥🔥 Mee andariki Deepavali Subhakankshalu. Love you guys. Can’t wait for Sankranthi😍🔥
Here is the DIWALI BLAST promo 💣
▶️ https://t.co/YI94w3Q97c @Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84… pic.twitter.com/5jHE399ZXg— Naveen Polishetty (@NaveenPolishety) October 20, 2025