'అనగనగా ఒక రాజు' నుంచి పెళ్లి సాంగ్ రిలీజ్ | Anaganaga Oka Raju Movie Raju Gaari Pelli Ro Song | Sakshi
Sakshi News home page

Anaganaga Oka Raju: నవీన్-మీనాక్షి పెళ్లి డ్యాన్స్.. పాట రిలీజ్

Dec 26 2025 5:35 PM | Updated on Dec 26 2025 5:48 PM

Anaganaga Oka Raju Movie Raju Gaari Pelli Ro Song

ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' ఒకటి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. మారి అనే దర్శకుడు.. ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు. జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే గ్లింప్స్, ఓ పాట రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో సాంగ్ విడుదల చేశారు.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

పెళ్లి నేపథ్యంగా తీసిన ఈ పాట కూడా ట్రెండింగ్ పదాలతో ఉంది. బీట్ కూడా బాగుంది. నవీన్-మీనాక్షి డ్యాన్స్ కూడా కలర్‌ఫుల్‌గా కనిపించింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లు కాస్త నెమ్మదించడంతో.. మూవీ వాయిదా పడే అవకాశముందని మాట్లాడుకున్నారు. ఇప్పుడు పాట రిలీజ్ చేసి అలాంటివే లేవని క్లారిటీ ఇచ్చినట్లయింది. నిర్మాత నాగవంశీ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈసారి వాయిదా ఉండదని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్‌' ఇమ్మాన్యుయేల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement