
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలిచాడు. పొలిశెట్టి హీరోగా వస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రోమోను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది.
తాజాగా ఇవాళ దసరా కావడంతో మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో సినీ ప్రియులకు నవీన్ పొలిశెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పచ్చని పొలాల మధ్య చేసిన ఈ ప్రమోషన్ వీడియో ఆడియన్స్‌ను అలరిస్తోంది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.