ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' కూడా ఒకటి. నవీన్ పొలిశెట్టి.. చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన మూవీ ఇది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇకపోతే ఇందులో ఇద్దరూ కలిసి భీమవరం బల్మా పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ పాట పూర్తి వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మీనాక్షి డ్యాన్స్ అదరగొట్టేసింది.
ఈసారి పండగకు రిలీజైన వాటిలో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' లీడ్ తీసుకోగా.. నవీన్ పొలిశెట్టి సినిమా కూడా ఉన్నంతలో బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. కథ పరంగా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కామెడీ ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు బాగానే చూశారు. నిర్మాణ సంస్థ అయితే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ప్రకటించారు. రిలీజై దాదాపు రెండు వారాలుపైనే అయిపోయింది. అయినా సరే హీరో నవీన్ పొలిశెట్టి.. అమెరికా వెళ్లి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నాడు.


