చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’నుంచి తాజాగా వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మూవీలో చాలా ఫన్నీగా సాగిన ఈ గీతాన్ని చిరంజీవినే పాడటం విశేషం. 'ఆ పెద్దిరెడ్డి వీధి మొదలు పెద్ద వదిన గారు' అంటూ సాగే ఈ పాటకు బాగానే విజిల్స్ పడ్డాయి.
పొగరెక్కిన పోటుగాడు కంచెదాటినాడే అనే చరణం నుంచి చిరు తన గొంతు కలుపుతారు. అందుకే ప్రత్యేకంగా యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో వెంకటేశ్ వెంకీ గౌడగా అతిథి పాత్రలో కనిపించి నవ్వులతో మెప్పించగా నయనతార తనదైన రీతిలో మంచి నటనతో ఆకట్టుకుంది.


