2020లో హిందీ చిత్రపరిశ్రమ ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది. వారిలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి సెలబ్రిటీలున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మాత్రం వార్తల్లో సంచలనమైంది. అతడి ఆత్మహత్యకు ప్రేయసి రియా చక్రవర్తి కారణమంటూ నెట్టింట సదరుహీరోయిన్‌పై తీవ్ర ట్రోలింగ్ జరిగింది.
జైలుకు
అలాగే సుశాంత్ మృతి కేసులో ఆమె అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయితే అతడి మరణానికి రియా చక్రవర్తికి ఎటువంటి సంబంధం లేదంటూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రియాకు ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో ఆమె పాడ్‌కాస్ట్‌తో పాటు చాప్టర్ 2 డ్రిప్ పేరిట బట్టల బిజినెస్ మొదలుపెట్టింది. ఈరోజు ఆ బ్రాండ్ విలువ రూ.40 కోట్లుగా ఉంది.
ఎగ్ ఫ్రీజింగ్
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు 33 ఏళ్లు. ఈ మధ్యే గైనకాలజిస్ట్‌ను కలిశా.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే ఓపక్క కెరీర్‌లో సెట్ అవ్వాలి. మరోపక్క సామాజిక ఒత్తిడి. మన శరీరం ఓ వయసు రాగానే పిల్లల గురించి ఆలోచించమని చెప్తుంది. కానీ మనసు మాత్రం.. నీ బిజినెస్, బ్రాండ్, కెరీర్.. అవే పిల్లలని, వాటి ఎదుగుదల గురించి ఫోకస్ చేయమని చెప్తుంది. నేనింకా సాధించాల్సింది చాలా ఉంది.
సినిమా
అందుకే ఇప్పుడే పెళ్లి, ఫ్యామిలీ అని ఆలోచించదల్చుకోలేదు. కాకపోతే ఎగ్ ఫ్రీజింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. రియా చక్రవర్తి (Rhea Chakraborty).. తూనీగ తూనీగ అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్ కీ మారుతి, సోనాలి కేబుల్, జిలేబి, చెహరె సినిమాలు చేసింది. దొబారా, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది.
చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్... రజనీకాంత్ ఏమన్నారంటే?


