తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్‌ జగన్‌ | Diwali 2025: YS Jagan Deepavali Warm Wishes To Telugu People | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్‌ జగన్‌

Oct 19 2025 6:46 PM | Updated on Oct 20 2025 8:09 AM

Diwali 2025: YS Jagan Deepavali Warm Wishes To Telugu People

గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.

‘ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఆనందాలు వెల్లువలా పొంగాలి’.వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ దీపావళి పండుగ,  ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలి. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నా. 

చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ట్విట్టర్‌ వేదికగా పోస్టు పెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement