
సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్(Abdul Kalam) జయంతి. ఈ సందర్భంగా అబ్ధుల్ కలామ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) నివాళులు అర్పించారు. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్ అని కొనియాడారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్. విద్యాశక్తిని నమ్మి, కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలంటూ కొన్ని తరాలకు స్ఫూర్తిని నింపిన వ్యక్తి అబ్దుల్ కలాం. మెరుగైన దేశాన్ని నిర్మించటానికి కృషి చేసిన మిస్సైల్ మ్యాన్‌కు నమస్కారిస్తున్నా అంటూ పోస్టు చేశారు.
Remembering Dr. A.P.J. Abdul Kalam , who embodied leadership through knowledge, humility, and service. On his jayanti, I salute the Missile Man who believed in the power of education and inspired a generation to dream and build a better India.#APJAbdulKalam pic.twitter.com/Y8D4253RJi
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025