బ్రూనైలో సేవ కార్యక్రమాలతో ఘనంగా దీపావళి వేడుక | Diwali celebrated with great service in Brunei | Sakshi
Sakshi News home page

బ్రూనైలో సేవ కార్యక్రమాలతో ఘనంగా దీపావళి వేడుక

Oct 23 2025 10:32 AM | Updated on Oct 23 2025 10:47 AM

Diwali celebrated with great service in Brunei

బ్రూనై దారుస్సలాం తెలుగు సంఘం, దీపావళి పండుగను దాతృత్వం సేవా కార్యక్రమాలతో అర్థవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు విల్లేజ్ పందాన్ బి ప్రాంతంలోని పాదచారుల మార్గంలో సమాజ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని సంఘం ప్రతి త్రైమాసికం శుభ్రపరుస్తూ వస్తోంది. ఈసారి బృందం ఏడు ట్రక్కుల వ్యర్థ పదార్థాలను సేకరించి, వాటిని టెలిసాయ్ రీసైక్లింగ్ సెంటర్‌కు తరలించింది.

ఈ కార్యక్రమానికి సొమునాయుడు దాది, సతీష్ పొలమత్రసెట్టి నాయకత్వం వహించగా, రమేష్ బాబు బదరవూరి, చింత వెంకటేశ్వరరావు మద్దతు అందించారు. పనగా బి గ్రామాధ్యక్షుడు శ్రీ మహమ్మద్ రవియాని బిన్ మోర్నీ గారి నేతృత్వంలోని MPK బృందం సమన్వయం, సహకారం అందించింది.

అదే రోజున, సంఘం సభ్యులు రిపాస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 24 యూనిట్ల రక్తం విజయవంతంగా సేకరించగా, కొంతమంది సభ్యులు ఆరోగ్య కారణాల వల్ల తమ రక్తదానాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నవీన్ కుమార్ సురపనేని సమన్వయం చేశారు. ఈ సేవా కార్యక్రమాలకు భారత రాయబారి హిజ్ ఎక్సలెన్సీ శ్రాము అబ్బగాని, పుష్పా అబ్బగాని హాజరై, సభ్యులను అభినందించి, సేవా కార్యక్రమాల పట్ల ప్రశంసలు తెలిపారు.

తెలుగు సంఘం అధ్యక్షుడు వెంకట రమణ రావు సూర్యదేవర మాట్లాడుతూ.. “దీపావళి పండుగ ఆత్మీయత, వెలుగు దాతృత్వానికి ప్రతీక. సమాజానికి సేవ చేయడం, శుభ్రతా కార్యక్రమాలు రక్తదానం వంటి చర్యలు ఈ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తాయి. సభ్యుల ఉత్సాహం సేవా మనసు సంఘానికి గర్వకారణం.” అని తెలిపారు.

(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement