హైదరాబాద్ : దున్నరాజుల విన్యాసాలు...కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, శంఖారావాలు, ఆటపాటలు, వీఐపీల సందడితో ఆదివారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ దద్దరిల్లింది. శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో దీపావళి సదర్ వేడుకల్ని సంబరంగా నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు రాజకీయ పారీ్టల నేతలు ఈ ఉత్సవానికి భారీగా తరలివచ్చారు. శ్రీ కృష్ణ భగవానుడికి, దున్నరాజులకు సీఎం రేవంత్‌రెడ్డి పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.
ఎంపీ అనిల్ కమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం జరగ్గా..జంటనగరాల నుండి యాదవులు వారి దున్న పోతులను అందంగా అలంకరించి తీసుకువచ్చారు. దాదాపు నాలుగైదు గంటలపాటు వాటి విన్యాసాలు వీక్షకులను అలరించాయి.


