
దీపావళి (Diwali 2025) అంటే ఆనందాల వేడుక. కానీ విషాదానికీ అవకాశం ఉన్న పండుగ. ఏటా దీపావళికి దేశవ్యాప్తంగా ఆసుపత్రులు బాణసంచా కారణమైన ప్రమాదాలతో అధిక భారం ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాలిన గాయాలు, కంటి గాయాలు, మంటలు మొదలైనవి.
2024లో ఒక్క ఢిల్లీలోనే అగ్నిమాపక కాల్స్ 53 శాతం పెరిగాయి. బెంగళూరు, లక్నో, చండీగఢ్ లాంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. చాలా కేసుల్లో పిల్లలు, బాణాసంచా కాల్చడం చూస్తున్నవారికి కూడా ప్రమాదాలు సంభవించాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకొని, ‘కవర్ ష్యూర్’ (CoverSure) అనే ఇన్సూర్టెక్ సంస్థ కేవలం రూ.5కే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్ (Firecracker Insurance ) ప్లాన్‌ను ప్రారంభించింది. బాణసంచా సంబంధిత ప్రమాదాల నుంచి రక్షణను అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు.
ప్లాన్ ముఖ్యాంశాలు
* అకాల మరణానికి కవరేజీ: రూ.50,000 వరకు
* కాలిన గాయాలకు కవరేజీ: రూ.10,000 వరకు
* 10 రోజుల పరిమిత కాల కవరేజీ (కొనుగోలు చేసిన తర్వాతి రోజు నుంచి)
* డిజిటల్ యాక్టివేషన్– ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా, వెంటనే యాక్టివ్
* కవర్ ష్యూర్ యాప్/వెబ్‌సైట్ ద్వారా తక్షణ కొనుగోలు
ఎందుకు అవసరమంటే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,000కి పైగా దీపావళి ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఈ సందర్భాల్లో చికిత్స ఖర్చు రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటోంది. చాలా మందికి సాంప్రదాయ ఆరోగ్య బీమా లేదు. దీంతో చిన్న ప్రమాదాలూ ఆర్థికంగా పెద్ద భారం కావచ్చు
ఈ ప్లాన్ ప్రామాణిక ఆరోగ్య/టర్మ్ పాలసీలను భర్తీ చేయదగినది కాదు కానీ వాటితో పాటు ముఖ్యంగా పండుగల కాలంలో అదనపు రక్షణగా పనిచేస్తుంది. బీమా తీసుకోండి.. దీపావళిని శుభంగా, సురక్షితంగా జరుపుకోండి.
ఇదీ చదవండి: ఎల్‌ఐసీ కొత్త పాలసీలు.. జీఎస్టీ తగ్గాక వచ్చిన ప్లాన్‌లు ఇవే..