
ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదని, ప్రతీ పనికిరాని అని మనం అనుకునే వ్యక్తికీ కూడా ఒక రోజంటూ వస్తుందని వాడుకగా చెప్పుకుంటాం. అయితే నేపాల్‌లో నిజంగానే కుక్కలకు అంటూ ఒక రోజు వస్తుంది. కుక్కలకే కాదు కాకులకు కూడా. ఈ వివరాలు తెలియాలంటే దీపావళి సందర్భంగా నేపాల్ లో కనిపించే ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి.
యమ పంచక్ లేదా దీపావళి అని కూడా పిలిచే తీహార్ , నేపాల్‌లో జరుపుకునే అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. తరచుగా లైట్ల పండుగ అని కూడా పేర్కొనే తీహార్, ఉత్సాహభరితమైన ఆచారాలు, కుటుంబ బంధాలు ప్రకృతితో సహజీవనపు వేడుకగా గుర్తింపు పొందింది. నేపాల్ అంతటా హిందువులు, బౌద్ధులు కూడా జరుపుకునే పండుగ ఇది. ఐదు రోజుల పాటు దేవతలు, జంతువులు సోదర సోదరీమణుల మధ్య అను బంధాన్ని ఈ పండుగ గౌరవిస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ (కార్తీక మాసం) ఆధారంగా ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు తీహార్ వేడుకలు జరుపు కుంటున్నారు. ఈ ఉత్సవం నేపాల్ ఇళ్లు, వీధులను కాంతులతో, సంగీత సంబరాలతో నింపుతుంది. దాదాపుగా మన దగ్గర జరిగే దీపావళి తరహాలోనే ఈ పండుగ కూడా ఉంటుంది. రంగు రంగుల లైట్లు రంగులను ఆస్వాదించడం, లక్ష్మీ దేవిని పూజించడం, రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం వరకూ కాకపోతే.. మానవులు జంతువులు, సోదరులు సోదరీ మణుల మధ్య బలమైన సంబంధాన్ని ప్రదర్శించడం ప్రత్యేకత అని చెప్పాలి.
తీహార్ అంటే?
కాంతి ప్రేమ ల పండుగ, ఇది జంతువుల ప్రాముఖ్యత, కుటుంబ సంబంధాల విలువలను, దైవిక ఆశీర్వాదాలను నొక్కి చెబుతుంది. ఇది యముడు (మరణ దేవుడు) , లక్ష్మీదేవి (సంపద శ్రేయస్సు నిచ్చే దేవత) లను గౌరవించడానికి ప్రకృతిలో అంతర్భాగంగా ఉన్న జంతువుల పట్ల కృతజ్ఞతను తెలియజేయడానికి జరుపుకుంటారు. చెడుపై మంచి విజయంపై సాధించే మాదిరిగా కాకుండా, తీహార్ పండుగ ఐక్యత, శ్రేయస్సు మానవులు, దేవతల మధ్య అనుబంధాన్ని చూపించేదిగా ఉంటుంది.
చదవండి: ఈ తియ్యటి పండుతో షుగర్‌కి చెక్ : తాజా అధ్యయనం
ప్రత్యేకం ‘‘కుకర్ తిహార్’’ (Kukur Tihar )
ఐదు రోజుల పాటు జరిగే పండుగలో రెండవ రోజు కుకర్ తిహార్ గా జరుపుకుంటారు. ఆ రోజు కుక్కలకు గజ్రాలు (పూల హారం) వేసి అలంకరిస్తారు, తిలకం (కుంకుమ బొట్టు) పెడతారు, ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు. ఈ ఆచారం వెనుక భావన ఏమిటంటే హిందూ పురాణాల్లో కుక్కలను యమ« దర్మరాజు దూతలుగా పరిగణిస్తారు. కాబట్టి వాటిని గౌరవిస్తే మనకు రక్షణ లభిస్తుందని నమ్మకం. విశేషం ఏమిటంటే ఆ రోజున వీధి కుక్కలకు సైతం పూజ చేస్తారు మన దేశంలోనూ గోవులకు పూజలు చేసే సంప్రదాయం ఉన్నా ఈ విధంగా కుక్కలకు పూజ చేయడం మాత్రం ఒక్క నేపాల్‌లో తప్ప మరెక్కడా లేదు.

ఐదు రోజులు ఐదు విధాలుగా...
–1వ రోజున కాగ్ తిహార్ జరుపుతారు. ఆ రోజున కాకులకు, గద్దలకు పూజ చేస్తారు. అన్నం, తీపి పదార్థాలు ఇస్తారు. వీటిని గౌరవిస్తే చెడు శకునాలు దరిచేరవనీ నమ్మకం.
–2వ రోజు కుకర్ తీహార్ పేరుతో కుక్కలకు పూల హారం, తిలకం వేసి పూజ చేస్తారు. వీటిని కూడా యమధర్మరాజు దూతలుగా పరిగణిస్తారు.
–3వ రోజు గై తిహార్ పేరుతో ఉదయం వేళలో ఆవులను పూజిస్తారు. ఆవు సంపద, శాంతి, మాతృత్వానికి చిహ్నం గా నమ్ముతారు. అదే రోజునసాయంత్రం ఇళ్లు శుభ్రపరచి దీపాలతో అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు.
–4వ రోజున గోవర్ధన్ పూజ / ‘మ్హ ’ పూజ చేస్తారు. ఆ రోజున ఎద్దులను పూలతో, పసుపుతో అలంకరించి పూజిస్తారు.. అంతేకాదు అదే రోజు ‘‘మ్హా పూజ’’ అంటే స్వశరీరాన్ని పూజించి ఆత్మశుద్ధి పొందడం.
ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్‌లో మెరిసిన ఇషా అంబానీ
–5వ రోజున భాయ్ తికా పేరుతో అక్కాచెల్లెమ్మలు, అన్నా తమ్ముళ్ల అనుబంధంను వేడుకగా జరుపుకుంటారు.ఆ రోజు అక్కాచెల్లెమ్మలు తమ అన్నల తలపై రంగురంగుల తికా (ఏడు రంగులతో) వేస్తారు. అన్నలు చెల్లెమ్మలకు బహుమతులు ఇస్తారు. ఇది ప్రేమ, రక్షణ, బంధుత్వానికి ప్రతీకగా భావిస్తారు.