
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన ఇంట్లో జరిగిన దీపావళి పూజ వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రతీ ఏడాదిలాగానే బాద్‌షా దీపావళి వేడుకలను నిర్వహించారు.
తన భార్య గౌరీ ఖాన్ పూజ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "అందరికీ దీపావళి శుభాకాంక్షలు! లక్ష్మీదేవి మీకు శ్రేయస్సు మరియు ఆనందాన్ని ప్రసాదించాలి. అందరికీ ప్రేమ, కాంతి మరియు శాంతిని కోరుకుంటున్నాను" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఖాన్ కుటుంబానికి నెటిజన్లు దీపావళి శుభాకాంక్షలు అందించారు. ప్రతీ ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా అన్నీ శుభాలే జరగాలని ఫ్యాన్స్ ఆయనను అభినందించారు. అలాగే షారూఖ్ మతసామరస్యంపై ప్రశంసలు కురిపించారు.
ఇదీ చదవండి: ముచ్చటగా మూడోసారి: తన రాక్‌స్టార్స్‌కు బ్రాండ్ న్యూ కార్లు గిఫ్ట్స్
కాగా షారూఖ్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది నవంబర్ 2 ఆయనను ఫిల్మ్ ఫెస్టివల్‌తో సత్కరిస్తారు. అక్టోబర్ 31 నుంచి PVR INOX ఒక ప్రత్యేక ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో షారూఖ్ సినీ జీవితంలో బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రదర్శిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఫిల్మ్ ఫెస్టివల్, 30 కి పైగా నగరాలు , దాదాపు