
దీపావళికి బోనస్‌లు, స్వీట్లు, గిఫ్ట్‌లు సహజమే. కానీ ఖరీదైన బహుమతు లివ్వడం వార్తల్లో నిలుస్తాయి. తాజాగా హెల్త్‌కేర్ సంస్థ వ్యవస్థాపకుడు సామాజిక కార్యకర్త ఎంకే భాటియా ముచ్చటగా మూడోసారి తన ఉద్యోగులకు వచ్చిన విలువైన బహుమతులు నెట్టింట సందడిగా మారాయి.
చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ‘మిట్స్ నేచురా లిమిటెడ్’ కంపెనీ అధినేత ఎంకే భాటియా దీపావళి వేడుకల్లో భాగంగా తన ఉద్యోగుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉద్యోగులకు 51 సరికొత్త కార్లను బహుమతిగా ఇచ్చారు. స్వయంగా తాళాలు అందజేసి వారిని అభినందించారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన బృంద సభ్యులకు ఎస్‌యూవీ, స్కార్పియో వంటి ఖరీదైన కార్లను అందించారు. ఎంకే బాటియా ఇలా కార్లను బహుమతిగా ఇవ్వడం వరుసగా ఇది మూడోసారి.
ఇదీ చదవండి: గౌరీ పూజ, షారూఖ్ ఖాన్ దీపావళి శుభాకాంక్షలు, నెటిజన్లు ఫిదా!
లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో, భాటియా ఏమన్నారంటే. ‘‘గత రెండు సంవత్సరాలుగా, అత్యంత అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చాం. అసలు వారిని ఉద్యోగులు లేదా సిబ్బంది అని ఎప్పుడూ పిలవలేదు. వారు నా జీవితంలో రాక్‌స్టార్ సెలబ్రిటీలు, మా ప్రయాణంలోని ప్రతి దశనూ బ్లాక్‌బస్టర్‌గా మార్చేసే తారలు. ఈ దీపావళి ఎక్స్‌ట్రా స్పెషల్" అంటూ కార్లను హ్యాండ్ఓవర్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. తన కంపెనీకి వారే వెన్నెముక అనీ, వారి కృషి, నిజాయితీ, అంకితభావమే తమ కంపెనీవిజయానికి పునాది. అందుకే వారి శ్రమను గుర్తించడం, ప్రోత్సహించడం, కంపెనీని మరింత అభివృద్ధి దిశ,ఉన్నత శిఖరాలకు నడిపించడం ఏకైక లక్ష్యమని తెలిపారు. వార్తా సంస్థ PTI ప్రకారం, భాటియా ఈ వారంలో ఉద్యోగులకు వాహనాలను అందజేశారు. ఆ తర్వాత షోరూమ్ నుండి కంపెనీ మిట్స్ హౌస్ ఆఫీస్ వరకు వేడుకగా "కార్ గిఫ్ట్ ర్యాలీ" కూడా జరిగిందట.

మీ విజయాన్ని లాభాలను ఉద్యోగులతో పంచుకోవడం చాలా సంతోషం అంటూ భాటియాను చాలామంది నెటిజన్లు ప్రశంసించారు. అంతేకాదు ఈ వీడియోను తన మేనేజర్‌కి చూపిస్తే ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారనీ, ఆ తరువాత డ్రైఫ్రూట్స్, 4 దీపాలు ఇచ్చారంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.
వరుసగా మూడోసారి
గత ఏడాది 15 కార్లను, అంతకు ముందు సంవత్సరం, 12 కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాబోయే సంవత్సరంలో 50 కార్లను బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్టు భాటియా గత దీపావళికే ప్రకటించడం విశేషం.